Home / తప్పక చదవాలి
ఇకపై కారులో వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తులు కూడ సీటు బెల్ట్ ధరించాలి. లేకుంటే వారు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు.
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తాజాగా 5008 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసోసియేట్స్ లేదా కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టులను భర్తీ చేయనుంది.
యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన భారత వైద్య విద్యార్థులు ఇప్పుడు ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లో చేరి వారి చదువును పూర్తి చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని జాతీయవైద్యమండలి ఉక్రెయిన్ అందించే అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ను గుర్తించడానికి అంగీకరించింది.
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిజిసిఐ) హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం కోసం మంగళవారం అనుమతి ఇచ్చింది.
ఢిల్లీలో ఈ నెల 8న జరగబోయే సెంట్రల్ విస్టా (కొత్త పార్లమెంట్ భవనసముదాయం ప్రారంభోత్సవం సందర్బంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కొన్ని రహదారులపై గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ ట్రాఫిక్ మళ్లించబడుతుందని ప్రకటించారు.
హైదరాబాద్ లో ట్రాపిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారు ఇకపై జాగ్రత్తగా లేకపోతే వారి జేబుకు చిల్లు పడినట్లే. ఇకపై మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కట్టవలసి వస్తుంది.
చారిత్రక నగరం వరంగల్ కు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు.
సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.