Last Updated:

Revanth reddy: నిరుద్యోగులకు మోసం చేస్తున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

Revanth reddy: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతోంది. ఈ వివాదంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లీకేజీ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Revanth reddy: నిరుద్యోగులకు మోసం చేస్తున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్

Revanth reddy: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతోంది. ఈ వివాదంపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లీకేజీ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ఫైర్..

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని పెద్దలే దీని వెనక ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ వివాదంపై అధికారులు రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం గాని.. సీఎం కేసీఆర్‌ గాని స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో.. ఇంతవరకు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఉందన్నారు.

నిరుద్యోగుల భవితవ్యం ఏంటి? (Revanth reddy)

ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో నిరుద్యోగుల్లో ఆందోళన మెుదలైందని.. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో నిరుద్యోగులు ఆందోళన చెందుతుంటే.. సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్‌జిల్లా మోపాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం రోజుకో మాట చెబుతోందని ఆరోపించారు. మొదట హ్యాక్‌ అయిందని.. ఆ తర్వాత హనీట్రాప్‌ జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా లీకైందని చెబుతున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గాని, రాష్ట్రప్రభుత్వం గానీ ఇప్పటి వరకు ఎందుకు వివరణ ఇవ్వలేదని ప్రశ్నించారు.

రాష్ట్రం ఏర్పడి 9ఏళ్లు గడిచినా ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయడం ప్రభుత్వం చేతగాని తీరుకు నిదర్శనమని అన్నారు.

తెలంగాణలో ఉద్యోగాలు లేక.. సుమారు 2వేల మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు. వచ్చే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను కేసీఆర్ టీమ్ లీక్ చేసిందని ఆరోపించారు.

ఉద్యోగాల కోసం.. పేద విద్యార్ధులు కష్టపడుతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

టీఎస్ పీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

పేపర్ లికేజీ వ్యవహారంతో టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని కోరుతూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

పేపర్‌ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు.

కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో.. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు.

ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధం ఉన్నవారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.