Last Updated:

MMTS Trains: పలు ఎంఎంటీఎస్ రైళ్లు క్యాన్సిల్.. ఆలస్యంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎంఎంటీఎస్ రద్దు నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపింది.

MMTS Trains: పలు ఎంఎంటీఎస్ రైళ్లు క్యాన్సిల్.. ఆలస్యంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్

MMTS Trains: హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాల మధ్య పలు ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎంఎంటీఎస్ రద్దు నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో లింగంపల్లి- హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి మధ్య 10 రైళ్లు.. ఈ నెల 14 నుంచి 17 తేదీల్లో ఉందానగర్‌-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, రామచంద్రాపురం-ఫలక్‌నుమా రూట్లలో పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.

 

క్యాన్సిల్ అయిన  రైళ్ల వివరాలు(MMTS Trains)

4 గంటలు ఆలస్యంగా వందే భారత్‌(MMTS Trains)

మరో వైపు సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ నాలుగు గంటల ఆలస్యంగా నడవనుంది. అనకాపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 5.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరాల్సిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20833) ఉదయం 8.45 గంటలకు బయల్దేరింది.

దీంతో సికింద్రాబాద్‌ – విశాఖ వందేభారత్‌ రైలు (20834) టైమింగ్స్‌ను అధికారులు రీ షెడ్యూల్‌ చేసినట్టు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరాల్సిన వందేభారత్‌ ఎక్స్ ప్రెస్ ఈ రోజు రాత్రి 7 గంటలకు బయలు దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.