Last Updated:

Warangal Cp: మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ

Warangal Cp: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం పై వరంగల్ సీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆయన మీడియాకి వివరించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.

Warangal Cp: మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ

Warangal Cp: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం పై వరంగల్ సీపీ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను ఆయన మీడియాకి వివరించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.

కీలక విషయాలు వెల్లడించిన సీపీ రంగనాథ్.. (Warangal Cp)

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. సీనియర్ విద్యార్ధి ర్యాగింగ్ వల్లే.. ప్రీతి అనే మెడికల్ విద్యార్ధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు సీపీ రంగనాథ్ మీడియాకు పలు విషయాలన వెల్లడించారు. సైఫ్ అనే సీనియర్‌ ప్రీతిని వేధించినట్లు పోలీసులు నిర్ధారించారు. సైఫ్‌ వేధించినట్లు ఆధారాలు లభించాయని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రీతిని కావాలనే టార్గెట్‌ చేసి సైఫ్‌ వేధించేవాడని తెలిపారు. గత నాలుగు నెలలుగా సైఫ్ వేధిస్తున్నట్లు తెలిసిందన్నారు. ప్రీతి చాలా సున్నిత మసన్తత్వం కలిగిన అమ్మాయని సీపీ అన్నారు. ప్రీతికి ఎవరు సహాయం చేయవద్దని.. సైఫ్ తన మిత్రులతో చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పలు సందర్భాల్లో బ్రెయిన్‌ లేదంటూ హేళన చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా ఇన్‌సల్ట్‌ గా ఫీలయితే అది ర్యాగింగ్‌ కిందికే వస్తుందని సీపీ అన్నారు. పాయిజన్‌ ఇంజెక్షన్‌ గురించి ప్రీతి గూగుల్‌ లో సెర్చ్‌ చేసినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్ధి అరెస్ట్..

ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులకు పాల్పడిన వైద్య విద్యార్థులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. ఈ వేధింపుల గురించి.. సీనియర్‌ విద్యార్థి సైఫ్ పై పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన.. వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. కొద్దీ రోజులుగా సైఫ్‌ ఆమెను వేధిస్తున్నాడు. ఇదే విషయాన్ని బాధిత విద్యార్ధి తన తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. తండ్రి పోలీసు విభాగంలో పనిచేయడంతో.. భద్రతా లభిస్తుందని ప్రీతి ఎదురుచూసింది. ఇదే విషయాన్ని ఏసీపీ బోనాల కిషన్‌కు ప్రీతి తండ్రి ఫోన్ చేసి వివరాలు చెప్పిన పట్టించుకోలేదు. మరోసారి ఏసీపీకి ఫిర్యాదు చేసిన.. సరైన స్పందన రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇదే విషయాన్ని కూతురికి వివరించాడు. పోలీసుల నుంచి సహకారం రాకపోవడంతో.. ప్రీతి ఆత్మహత్యాయ్నం చేసింది. ఈ ఆరోపణల్లో మంత్రి పేరు రావడం చర్చనీయంశంగా మారింది. తనకు ఓ మంత్రి అండదండలు ఉన్నాయని సైఫ్‌ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపింది.

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం..

ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి విషమంగానే ఉంది. ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కాస్త మెరుగవుతుందని వైద్యులు వివరించారు. ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌ కు చెందిన ప్రీతి అనే అమ్మాయి.. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత విద్యార్ధిని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు. బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అక్కడి విద్యార్ధులు అంటున్నారు.