Lokesh about AP CM Post: ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?
Nara Lokesh about CM Post in Mahanadu 2025: నారా లోకేష్… ఇప్పుడు తెలుగు దేశంలో టాప్ 2 లీడర్, ఆపై షాడో సీఎం అని కొందరి అభిప్రాయం. తాజాగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు బహిరంగంగానే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. ఆతర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సీటు ఇవ్వాలంటూ చర్యలు నడిచాయి. అయితే ఈ విషయాలపై చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. తాజాగా లోకేష్ నే మీరు సీఎం పదవిని వరించాలని కోరారు. అందుకు ఆయన ఏమన్నాడంటే..

nara lokesh at mahanadu 2025
ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమన్నారు. చంద్రబాబు వయస్సులో పెద్దవారే.. కానీ హార్ట్ చాలా యంగ్ అని చెప్పారు. ఆయనలా యోగా ఎవరు చేయలేరని కొనియాడారు. అయినా ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదని అన్నారు నారా లోకేష్.
గతంలో తన తల్లి ఎంత ఆవేదన చెందిందో కళ్లారా చూశానని.. కానీ జగన్ కుటుంబంలో ఎవరినీ ఒక్క మాట అనలేదని నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పేరు చెబితే చాలా మంది బయపడుతున్నారని చెప్పారు. కొంత మంది అడవుల్లోకి.. మరికొందరు బాత్ రూమ్‌లో జారిపడుతున్నారని.. ఇంకొందరు ఆసుపత్రిపాలు అవుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.

minister nara lokesh at mahanadu 2025
అధికారంలోకి వచ్చాం కాబట్టి అంతా బాగుందనే భావన సరికాదని.. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తేనే వాస్తవాలు తెలుస్తున్నాయని లోకేష్ అన్నారు. కింది స్థాయి అభిప్రాయాలపై నిరంతరం చర్చ జరగాలని చెప్పారు. రాజకీయ నాయకులను సొసైటీలో ఎక్కువమంది ఫాలో అవుతుంటారని.. కాబట్టి రాజకీయ నాయకులు తమ భాష మార్చుకోవాలని చూసించారు.
ప్రధానితో రెండు గంటలు సేపు కూర్చోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు. తాను ప్రధానికి 20 ప్రశ్నలు వేశానని చెప్పారు. రాబోయే ఐదు దశాబ్దాలు పార్టీ భవిష్యత్ బాగుండాలని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వానికి ఎంత సమయం కేటాయిస్తానో.. పార్టీకి కూడా అంత సమయం కేటాయిస్తామని చెప్పారు. ఈ సారి ప్రభుత్వం, పార్టీని రెండు బ్యాలెన్స్ చేస్తామని తెలిపారు. కుప్పంలో ఎనిమిది సార్లు చంద్రబాబు గెలిచారు కాబట్టి.. చంద్రబాబు మార్క్ డెవలప్ మెంట్ కనిపిస్తుందని అన్నారు.