Last Updated:

Flexy War : ఏపీలో రోజురోజుకీ మరింత ముదురుతున్న ఫ్లెక్సీ వార్‌.. జనసేన వర్సెస్ వైసీపీ

ఏపీలో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య మాటల యుద్దం రోజురోజుకీ మరింత ముదురుతుంది. అయితే ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీలో ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది. ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం రచ్చ

Flexy War : ఏపీలో రోజురోజుకీ మరింత ముదురుతున్న ఫ్లెక్సీ వార్‌.. జనసేన వర్సెస్ వైసీపీ

Flexy War : ఏపీలో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య మాటల యుద్దం రోజురోజుకీ మరింత ముదురుతుంది. అయితే ఏపీలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. మరి ముఖ్యంగా గత కొంతకాలంగా ఏపీలో ఫ్లెక్సీ వార్‌ నడుస్తోంది. ఒక ప్రాంతానికో, జిల్లాకో పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం రచ్చ రచ్చగా నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ వర్సెస్‌ ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. జనసేన వర్సస్ వైసీపీ ఫ్లెక్సీ వార్ గురించి మీకోసం ప్రత్యేకంగా..

పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం పేరుతో రాష్ట్రంలో అధికార పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫెక్సీలపై  (Flexy War) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సిలలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అడ్డుగా మోకాళ్లపై కూర్చుని.. పెత్తందార్లతో పోరాడుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీల్లో ఉంది. ఎదురుగా పల్లకీ మీద టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఉండగా.. జనసేన పార్టీ అధినేత పవన కళ్యాణ్ ఆ పల్లకీని మోస్తున్నట్టుగా చూపించారు.

ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేతను పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లు వైసీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీ మరింత అగ్గిని రాజేసింది. ఇందుకు ప్రతిగా జనసేన నేతలు వైసిపీ నేతల తీరుపై ప్లెక్సీ ఏర్పాటు చేస్తూ.. మరింత అగ్గి రాజేశారు. అయితే పవన్ కళ్యాణ్ ని కించపరిచేలా ఉన్న ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరుతూ జనసేన నాయకులు పలు చోట్ల ఇప్పటికే ఆందోళన చేపట్టారు. తాజాగా కైకలూరులో వైసీపీ ఫ్లెక్సీల పక్కనే జనసేన ఫ్లెక్సీలు పెట్టడంతో గొడవ మొదలైంది. అధికార పార్టీ కార్యకర్తుల జనసేన ఫ్లెక్సీలు తొలగించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అడ్డుకున్న పోలీసుతో జనసేన కార్యకర్తలు గొడవకు దిగడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక పార్టీ పై మరో పార్టీ నినాదాలు.. వ్యంగాస్త్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వివాదానికి కారణం అవుతోంది. మరి ఈ వివాదం ఎపుడు ముగుస్తుందో .. లేదా మరింత తీవ్ర తరం అవుతుందో రానున్న రోజుల్లో తేలనుంది.