Vijayawada: టైమ్ పాస్ ప్రేమతో పిచ్చివాడనయ్యానంటూ.. బీటెక్ విద్యార్థి సూసైడ్ నోట్
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.

Vijayawada: విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు. ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిందని ఆరోపించాడు. ప్రియురాలి మోసాన్ని భరించలేక తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా చెప్పాడు.
తనతో ప్రేమలో ఉంటూనే.. పెళ్లయిన లెక్చరర్ తో రిలేషన్ షిప్
ఆమె తనతో ప్రేమలో ఉన్నట్లు నటిస్తోందని.. పెళ్లయిన లెక్చరర్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తోందని లేఖలో పేర్కొన్నాడు. రాత్రి వేళల్లో ఆమె వేరొకరితో వీడియో కాల్స్ చేసిందని ఆరోపించాడు. ఆమె ప్రవర్తనను మార్చేందుకు ఎంతగా ప్రయత్నించిన మారలేదని పేర్కొన్నాడు. తాను సరిగా చదవలేకపోతున్నానని, ఇవన్ని వదిలేయమని చెప్పినా కూడా రాత్రి 1.30 తరువాత వీడియో కాల్స్ మాట్లాడుతుందని లేఖలో సలామ్ పేర్కొన్నాడు. తన టైమ్ పాస్ ప్రేమ వల్ల పిచ్చివాడ్ని అయ్యానని, బ్రతకలేకపోతున్నానని వివరించాడు. ఆమె చేతిలో మోసపోయిన అమాయక కుర్రాళ్లకు న్యాయం చేయాలని లేఖలో రాశాడు. ఈ ఘటనపై ఈ కేసు నమోదు చేసుకున్న విజయవాడ(Vijayawada) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మోసం చేసే అమ్మాయిలపై సెక్షన్లు లేవా..
కాగా తాజాగా అబ్ధుల సలామ్ తల్లి తమన్నా తన కుమారుడి మరణ వార్త విని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. తన కుమారుడి మరణానికి కారణమైన కుసుమిక అనే అమ్మాయిని కఠినంగా శిక్షించాలని కోరింది. తన కుమారుడిని ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిందని లేఖలో రాశాడని.. తమకు ముందే తెలిసి ఉంటే మేము మాట్లాడేవాళ్లమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చేస్తానని చెప్పిన అబ్ధుల్లా ఇలా సడెన్ గా సూసైడ్ చేసుకున్నాడని తన స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్తూ ఆమె గుండెలు పగిలేలా ఏడ్చారు. తన బిడ్డ చివరి కోరిక ప్రకారం ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసే అమ్మాయిలపై సెక్షన్లు లేవా.. నా బిడ్డ ఎంతో మనోవేదనకు గురయ్యాడు.. మరొకరికి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని తమన్నా పోలీసులను వేడుకుంది.
ఇవి కూడా చదవండి:
Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/