Last Updated:

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి ఫోన్ పోయిందట.. కాదు పడేసారంటున్న టీడీపీ నేతలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్‌ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి ఫోన్ పోయిందట.. కాదు పడేసారంటున్న టీడీపీ నేతలు

Andhra Pradesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్‌ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఫోన్‌ పోయిందంటూ ఆయన చెప్పడం వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు. భవిష్యత్తులో సీబీఐ, ఈడీ అధికారులు విచారణకు పిలిస్తే, తన ఫోన్‌ గతంలోనే పోయిందని చెప్పేందుకు ఇప్పుడే పక్కా ప్లాన్‌ వేశారంటూ ఆరోపిస్తున్నారు. స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో మాట్లాడించుకుండా ప్రతీ సారి విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తనకు ఏమాత్రం సంబంధం లేదంటూ విజయసాయి రెడ్డి చెబుతూ వచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి తన ఫోన్‌ పోయిందని చెప్పడం. ఈ స్కామ్‌లో విజయసాయి పాత్ర ఉంది అనే వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. దీనిపై టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నేరుగా విజయసాయి రెడ్డిని టార్గెట్‌ చేశారు. విజయసాయి రెడ్డి ఫోన్‌ పోలేదని, ఆయనే కావాలని ఫోన్‌ను పడేశారన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో తాడేపల్లి ప్యాలస్‌ పూసాలు కదులుతున్నాయంటూ ట్వీట్‌ చేశారు. స్కామ్‌కు సంబంధించిన వివరాలు ఫోన్‌లో ఉన్న కారణంగానే ఫోన్‌ను దాచేసి, పోయిందంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు.

ఏపీ పొలిటికల్‌ సర్కిల్‌లో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఐఫోన్‌ గురించే చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్‌ రెడ్డి సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్‌తో వైసీపీలో కలలకం రేగింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో షాపులు పొందిన ట్రైడెంట్‌ సంస్థ స్వయంగా విజయసాయిరెడ్డి వియ్యంకుడిది. రోహిత్‌ రెడ్డి కుటుంబానికి ఈ సంస్థలో వంద శాతం వాటా ఉంది. ఆ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్‌ స్వయంగా అదాన్‌ డిస్టిలరీస్‌ వ్యవస్థాపకుడు. పైగా విమానాల్లో నగదు తరలించారన్న వార్తలు కూడా ఉన్నాయి. దీంతో ఈ విషయం పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి: