Last Updated:

Vice-presidential poll: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్‌ ధన్కర్‌ నామినేషన్‌

ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్‌ ధన్కర్‌ నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా హాజరయ్యారు. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ధన్కర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరయ్యారు.

Vice-presidential poll: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్‌ ధన్కర్‌ నామినేషన్‌

New Delhi: ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్‌దీప్‌ ధన్కర్‌ నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా హాజరయ్యారు. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ధన్కర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరయ్యారు.

ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. పార్లమెంటు సభ్యులే ఓటర్లు కావడం. ఉభయసభల్లో ఎన్‌డీఏకే మెజారిటీ ఉండడంతో పాలక కూటమి అభ్యర్థి విజయం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు ప్రస్తుత బలం 780 కాగా, మెజారిటీ మార్కుకు 390 అవసరం. ఒక్క బీజేపీకే 394 మంది ఎంపీలు ఉన్నారు. దానికితోడు అనేక మిత్రపక్షాలు మందుకు రావడంతో, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకలాగే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: