Home / NDA
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
లోక్ సభలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపికైన నరేంద్రమోదీ ... ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీ కోసం ఎనలేని కృషి చేసిన పార్టీ కార్యకర్తలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
అన్నాడీఎంకే ( ఏఐఏడీఎంకే) పార్టీ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో తమ బంధం ముగిసినట్లేనని ప్రకటించింది. సోమవారం తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత అన్నాడీఎంకే ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకున్నారు. అధికారికంగా ఎన్డీఏలో చేరారు. అమిత్ షా, కుమార స్వామి సమావేశంలో బీజేపీ ప్రెసిడెంట్ జెపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా హాజరయ్యారు.
ఐక్యత కోసం పిలుపుతో, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బెంగళూరులో కీలక సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి ప్రతిగా ఈరోజు తర్వాత న్యూఢిల్లీలో బీజేపీ మెగా మీట్ నిర్వహించనుంది. చర్చల ఎజెండాను లాంఛనంగా చేయడానికి ప్రతిపక్ష అగ్రనేతలు నిన్న విందు సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారికంగా చర్చలు జరగనున్నాయి.
బీహార్‌లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జగ్దీప్ ధన్కర్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా , కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా హాజరయ్యారు. వచ్చే నెల 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. ధన్కర్ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కూడా హాజరయ్యారు.