Telangana Government Declared Public Holiday in Honor of Former PM Manmohan Singh: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యా సంస్థలు సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికారులకు సెలవు ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వారంరోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.
కాగా, మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు ఏపీలోనూ సెలవు ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అయితే మన్మోహన్ సింగ్ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ రాష్ట్రంలోనూ హాలీడే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.