Tammareddy Bharadwaj: ఒక్కరి వల్ల ఇండస్ట్రీ మొత్తం తలదించుకోవాల్సి వచ్చింది – అల్లు అర్జున్‌ వివాదంపై నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

  • Written By:
  • Updated On - December 27, 2024 / 05:08 PM IST

Tammareddy Bharadwaj Shocking Comments on Allu Arjun: సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత రాష్ట్రంలో, సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిణామాలు గురించి తెలిసిందే. పుష్ప 2 మూవీ బెనిఫిట్‌ షో నేపథ్యంలో సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్‌ అక్కడికి వెళ్లడమే ఇలా జరిగిందని, పర్మిషన్‌ లేకున్న వచ్చాడనేది తెలంగాణ ప్రభుత్వం, పోలీసుల వాదన.

ఈ ఘటనలో  థియేటర్‌ యాజమాన్యం, అల్లు అర్జున్‌తో పాటు మరికొందరి మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇక అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి తాను ఉన్నంత కాలం తెలంగాణ ఇక బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పారు. దీని తర్వాత అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తన క్యారెక్టర్‌ని దిగజార్చేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశం వివిధ పరిణామాలకు దారి తీసింది. ఆఖరికి సినీ ఇండస్ట్రీ సీఎంతో సమావేశం వరకు వెళ్లింది.

తాజాగా ఈ అంశంపై సీనియర్‌ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియో రిలీజ్‌ చేశారు. “ఇవాళ, రేపు ముఖ్యమంత్రి సినీ ఇండస్ట్రీ కలిసింది. దీనిపై సోల్యూషన్‌ వస్తుందని ఆశిస్తున్నా. కానీ అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరూ? ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంత వెళ్లి ముఖ్యమంత్రుల దగ్గర చేతులు కట్టుకుని నిల్చునే పరిస్థితులు తీసుకురావడం ఎవరి కోసం. ఎవరి స్వార్థం కోసం వాళ్లు ఇండస్ట్రీ తలవంపులు తచ్చే పరిస్థితి వస్తుంది. దీనిపై ఆలోచిస్తే ఇండస్ట్రీ వాళ్ల అందరికి అర్థమవుతుంది. అలాగే బయటి వాళ్లకు కూడా అర్థమవుతుంది” అన్నారు.

“ఇక అల్లు అర్జున్‌ వివాదం గురించి చెప్పుకుంటే దీనికి బాధ్యులు ఎవరూ? అల్లు అర్జునా? ఆయన పక్కన ఉండే బౌన్సర్ల? వారి ఆప్తులమని చెప్పుకునే పక్కన తిరిగే వాళ్లా?. అభిమానులు హీరోలను దేవుళ్లుగా చూస్తారు. నిజంగా వాళ్లకు దేవుళ్లు అనే ఫీలింగ్‌ వస్తుంది. అలాగే మూడు నాలుగు కార్లలో వెళ్లి ర్యాలీగా రావాలని పక్కన ఉన్నవాళ్లంతా చెబుతారు. రోడ్డుపై ప్రదర్శన చేయాలని, జనాలంతా వచ్చేవరకు వెయిట్‌ చేయాలని పక్కన ఉన్నవాళ్లంత చెబుతున్నారు. వారే హీరోలను చెడగొడుతున్నారు. ఈ విషయాన్ని హీరోలు కాస్తా ఆలోచించాలి” అన్నారు.

“సంధ్య థియేటర్‌ ఘటనలో అల్లు అర్జున్‌ తనకు తెలియకుండానే బాధ్యుడు అయ్యాడు. ఆయన మర్డర్‌ చేశాడని నేను అనడం లేదు. అయితే తప్పు అయితే జరిగింది. తనకు తెలియకుండానే బన్నీ బాధ్యుడు అయ్యాడు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన కొన్ని అబద్ధాలు ఆడాడు. దీనిపై ప్రభుత్వం ప్రెస్టెజ్‌ అయిపోయింది. ఇటూ ఈయన కూడా ప్రెస్టెజ్‌గా అయిపోయింది. దీనివల్ల ఈ రోజు ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం వెళ్లి సీఎంను కలవాల్సి వచ్చింది. ఒక్కరి స్వార్థం, ఒక్కరి తప్పు వల్ల ఇండస్ట్రీ మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

మీ సొంత లాభం కోసం ఏమైనా చేసుకోండి. కానీ, ఎదుటివారి ప్రాణాలు పోయేంత వరకు వెళ్లోద్దగు. ఇది మీరు ఎప్పుడైతే సాధారణ మనిషి కాదని ఫీల్‌ అయినప్పుడే ఈ ప్రదర్శనలు, రోడ్‌ షోలు చేయాల్సి వస్తుంది. అదే మీరు కూడా సాధారణ మనిషి అనే భావతో ఉండండి. సైలెంట్‌ వెళ్లి సినిమా చూసిరండి ఇలాంటి జరగవు. అలా వెళ్లిన జనాలు సినిమాకు వస్తారు. ఒక్కసారి ఇప్పటి హీరోలు దీనిపై ఆలోచండి. భవిష్యత్తులో ఇలాంటి తలవంపులు తెచ్చే పరిస్థితులు హీరోలు తీసుకురాకుండ జాగ్రత్త పడాలి” అని భరద్వాజ్‌ అన్నారు.