Last Updated:

Horoscope Today: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: చాలామందికి రోజువారి జీవితంలో భాగంగా.. వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. దీనికి వారు ఎక్కువ విశ్వసించే విధానం జ్యోతిష్యం.

Horoscope Today: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope Today: చాలామందికి రోజువారి జీవితంలో భాగంగా.. వారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. దీనికి వారు ఎక్కువ విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్ ఎలా ఉంటుందో పండితులు లెక్కిస్తారు. గురువారం 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

మేషం: ఈ రాశివారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పని విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. కష్టం మీద ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం లభించదు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

వృషభం: ఉద్యోగులకు అనుకూల సమయం. మీరు చేసే పనిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికార యోగానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ విషయంలో గుడ్ న్యూస్ వింటారు. ఆర్ధిక విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇష్టపడిన వారితో పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది.

ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం..

మిథునం: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో మీరు అనుకున్నది సాధిస్తారు. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను నమ్మీ ఆర్ధికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొద్దిగా నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగి ఇబ్బందిపడతారు. ఆర్థిక సహాయం కోసం స్నేహితులు కొందరు ఒత్తిడి తీసుకువస్తారు. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిది.

సింహం: ఈ రాశివారు.. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఏళ్లుగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నేడు ఈ రాశివారికి సమయం కలసివస్తుంది.

కన్య: ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి.

తుల: ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఆహార విషయాల్లో క్రమశిక్షణ అవసరం. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా సమస్యలున్నా, ముందుకు దూసుకుపోతారు. పెళ్లి ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం: ఉద్యోగ విషయంలో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఈ రాశివారు శుభవార్త వింటారు..

ధనుస్సు: దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఊహించని విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులు, తోబుట్టువుల ద్వారా ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.

మకరం: మీకు ఉన్నదానికి మించి మీ స్నేహితులకు సాయం అందిస్తారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమయం నడుస్తుంది. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

కుంభం: ఆర్థిక, పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి.

ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీస్తాయి. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.

బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.

మీనం: వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఐటి వంటి వృత్తి నిపుణులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది.

ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి.

వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.