Last Updated:

Horoscope Today: ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం: ఈ రాశివారు సొంత పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే నేడు నష్టాలను చూసే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కీలక విషయాల్లో బంధుమిత్రుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆకస్మిక ధన లాభం ఉంది. శుభవార్త వింటారు.

వృషభం: ఉద్యోగవి విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. పని విషయంలో అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆదాయం విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి.

మిథునం: ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల అభిమానం సంపాదిస్తారు. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకండి.

కర్కాటకం: ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆలోచించాలి. అనవసర విషయాల్లో డబ్బు ఖర్చు చేయవద్దు. ఉద్యోగ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఇరుగుపొరుగుతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

సింహం: ఆర్ధిక విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తారు. వృత్తి వ్యాపారాల వారికి విశేష పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవు. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు.

ఉద్యోగం విషయంలో సానుకూలత..

కన్య: ఉద్యోగం విషయంలో సానుకూలత ఉంటుంది. స్నేహితులకు సహాయం చేస్తారు. బంధువుల విషయంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది.

తుల: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది.

వృశ్చికం: నిరుద్యోగులకు ఈ రాశి కలసివస్తుంది. ఇతరులతో మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.

ధనుస్సు: కుటుంబం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏళ్లుగా ఉన్న కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

మకరం: బంధువుల ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురైనప్పటికీ చక్కని అభివృద్ధిని సాధిస్తారు.

వివాదాలకు ఆస్కారం..

కుంభం: నిరుద్యోగులకు ఈ రాశి అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను సాధిస్తారు. ఐటీ రంగంలో అనుకూల పరిస్థితలు ఉంటాయి. ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది.

మీనం: ఉద్యోగరీత్యా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అవసరమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది.