Last Updated:

Patancheru : పటాన్‌చెరు నియోజకవర్గంలో ’గూడెం బ్రదర్స్‘ జోరు

పటాన్‌చెరు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. గూడెం బ్రదర్స్ జోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.

Patancheru : పటాన్‌చెరు నియోజకవర్గంలో ’గూడెం బ్రదర్స్‘  జోరు

Patancheru : పటాన్‌చెరు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. గూడెం బ్రదర్స్ జోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.

రాజకీయాలకు దూరంగా ఉండే ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తమ్ముడు గూడెం మధుసుదన్ రెడ్డి ఈ సారి దూకుడు పెంచారు. సమస్య వచ్చిందంటే చాలు నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి ఇంటి తలుపు తట్టే వారి సంఖ్యే ఎక్కువ. ఆటో యూనియన్ సభ్యులతో మొదలు పెడితే కార్మిక సంఘాల సమస్యలు తీరుస్తూ మంచి నాయకుడిగా గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాలకు దూరంగా ఉంటూ.. నిశితంగా పరిశీలించే గూడెం మధుసూదన్‌రెడ్డి – ఇప్పుడు అన్న మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్‌ గెలుపుకోసం అన్నీ తానై శ్రమిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లని ఆయన – అన్ని వర్గాలను కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా జిన్నారం,అమీన్‌పూర్ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేస్తూ అన్నకు అండగా ఉంటున్నారు. తద్వారా నియోజకవర్గంలో పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు.

ప్రత్యర్థివర్గాలపై కన్నేసిన గూడెం మధుసూదన్‌రెడ్డి – సొంత పార్టీలోని గ్రూపులనూ తన కంట్రోల్‌లో పెట్టుకుంటున్నారు. దీంతో మహిపాల్‌రెడ్డికి రాజకీయంగా ఈజీ అవుతోంది. ప్రచారాలకు దూరంగా ఉంటూ అన్న మదిలోని ఆలోచనలను ఆచరణలో చూపిస్తున్నారు. నియోజకవర్గంలోని యువతను అకర్షించి వారికి ఉపాధి కల్పించడమే కాకుండా.. వ్యాపారం వైపు వారి దృష్టిని మరలుస్తున్నారు. ఇతర పార్టీల్లోని యువతను తమవైపు తిప్పుకుంటున్నారు గూడం మధుసూదన్ రెడ్డి. ఆయన వ్యూహాలు కాంగ్రెస్, బీజేపీలకు మింగుడు పడడంలేదు. కుల సంఘాలు కూడా తమనుంచి జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు గూడెం బ్రదర్స్‌. మరోవైపు రెండు సార్లు పటాన్‌చెరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి – హ్యాట్రిక్‌ కోసం ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం కుల,మతాలకు అతీతంగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రోగ్సామ్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. నియోజకవర్గంపై పట్టుజారిపోకుండా చూస్తున్నారు.

ప్రత్యర్థిపార్టీల ఆరోపణలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు గూడెం బ్రదర్స్‌. నియోజకవర్గం అభివృద్ధిపైనే ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఎన్నికలనాటికి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మొత్తంమీద గూడెం బ్రదర్స్‌ – పొలిటికల్‌ దూకుడు మిగతాపార్టీలకు మింగుడుపడటంలేదు.

ఇవి కూడా చదవండి: