Last Updated:

#Rip Twitter: ట్విట్టర్లో కొత్త పాలసీ.. ఇకపై అలాంటి పోస్టులకు అడ్డుకట్ట

ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. మరి ఆ పాలసీ వివరాలేంటో చూసేయ్యండి.

#Rip Twitter: ట్విట్టర్లో కొత్త పాలసీ.. ఇకపై అలాంటి పోస్టులకు అడ్డుకట్ట

#Rip Twitter: ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్. అయితే ఇప్పటికే ఈయన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు మస్క్. ఈ తరుణంలోనే ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించాడు. ట్విట్టర్ లో వినియోగదారులకు వాక్ స్వాతంత్య్రం ఉందని, ఎలాంటి పోస్టులనైనా పెట్టొచ్చని చెప్తూనే మరోవైపు నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండబోదని తేల్చి చెప్పారు.

నెగెటివిటీ లేదా హేట్ స్పీచ్ వంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ప్రమోట్ చేయమని స్పష్టం చేశారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ట్విట్టర్లో ప్రత్యేక వ్యవస్థ ఉందని చెప్పారు. వాటిని బూస్టప్ చేయమని, మోనిటైజ్ పరిధిలోకి తీసుకురామని వెల్లడించారు. నెగటివిటీ పోస్టులపై యూజర్లకు ఎలాంటి రెవెన్యూ ఉండబోదని తేల్చారు. అడ్వర్టయిజ్‌మెంట్లను కూడా నియంత్రిస్తామని పేర్కొన్నారు. యూజర్లు పోస్ట్ చేసిన నెగెటివ్/హేట్ స్పీచ్‌కు సంబంధించిన ట్వీట్లు ప్రత్యేకంగా ఇంటర్నెట్‌లో వెదికితే తప్ప అవి కనిపించబోవని చురకలు అంటించారు. అలాంటి వాటిని వ్యక్తిగత ట్వీట్లకు మాత్రమే పరిమితం చేసినట్లు మస్క్ వివరించారు.

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా రిప్ ట్విట్టర్ హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్లోని ఉద్యోగులను ఎక్కువ పనిగంటలు చెయ్యాలని దానికి అంగీకరించని వాళ్లను విధుల నుంచి తొలగిస్తామని మస్క్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ట్విట్టర్‌లో సామూహిక రాజీనామాలు పర్వం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ట్విట్టర్ కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేయబడతాయని త్వరలోనే ప్రారంభం అవుతాయని, ఉద్యోగులు ఎవరూ రిపోర్ట్ చేయవద్దని కంపెనీ ఆదేశించింది. ఈ తరుణంలో ట్విట్టర్‌లో #RIPTwitter ట్రెండ్ అవుతోంది. ట్విట్టర్ కార్యాలయాలను మూసివేతతో అక్కడి ఉద్యోగులతో పాటు నెటిజన్లు కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు. మరి మున్ముందు మస్క్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఏమో అని అటు ఉద్యోగులు ఇటు యూజర్లు తలలు పట్టుకుంటున్నారు.

ఇదీ చదవండి:  కష్టపడి పనిచెయ్యండి లేదంటే ఇంటికెళ్లండి.. ఉద్యోగులకు మస్క్ మెయిల్స్

ఇవి కూడా చదవండి: