Last Updated:

Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. సమయం కావాలని కేటీఆర్ రిక్వెస్ట్

Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. సమయం కావాలని కేటీఆర్ రిక్వెస్ట్

ED Accepts KTR Request in Formula E-Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసు కేసు విచారణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమయం కోరారు. ఈ మేరకు ఈడీ కూడా గడువు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి ఎప్పుడు హాజరుకావాలో ఈడీ వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఇవాళ ఈడీ ముందు కేటీఆర్ హాజరుకావాల్సి ఉంది.

అయితే, ఈ కార్ రేసులో మంగళవారం విచారణకు రావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా, నేడు విచారణకు హాజరుకాలేనని కేటీఆర్.. ఈడీకి మెయిల్ చేశారు. కేటీఆర్ పంపిన ఈమెయిల్‌కు ఈడీ స్పందించింది.

ఇదిలా ఉండగా, కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. ఉదయం 10.30 నిమిషాలకు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు రావడానికి వీలు కాదని కేటీఆర్ అందులో వివరించారు.