Writer Ramalakshmi : ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి రామలక్ష్మి మృతి..
ప్రముఖ రచయిత, సినీ కవి.. దివంగత ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె. రామలక్ష్మి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్ శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారని తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
Writer Ramalakshmi : ప్రముఖ రచయిత, సినీ కవి.. దివంగత ఆరుద్ర సతీమణి, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కె. రామలక్ష్మి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్ శ్రీ సాయి అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారని తెలుస్తుంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఎస్‌ఆర్ నగర్ లోని విద్యుత్తు దహన వాటికలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.
బాల్యం, విద్యాభ్యాసం..
రామలక్ష్మి కాకినాడ జిల్లా కోటనందూరులో 1930 డిసెంబరు 31న జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం పరిధిలోని స్టెల్లా మారిస్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1951 నుంచి ఆమె రచనా వ్యాసంగం ప్రారంభించారు. 1954 లో ఆరుద్రతో వివాహం జరగగా.. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మానవశాస్త్రం, మానవ సంబంధాలపై ప్రొఫెసర్ యు.ఆర్. ఎబ్రెన్‌ఫెల్స్ ఆధ్వర్యంలో అధ్యయనం చేశారు. ప్రముఖ పాత్రికేయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు ఖాసా సుబ్బారావు ఆధ్వర్యంలోని ‘స్వతంత్ర’ పత్రికలో ఆంగ్ల విభాగానికి ఉప సంపాదకురాలిగా చేశారు.
(Writer Ramalakshmi) రచనలు పురస్కారాలు..
పెళ్లి తర్వాత “రామలక్ష్మి ఆరుద్ర” అనే కలం పేరు తోనూ రచనలు చేశారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి. పరిశోధన, వ్యాసం, చిన్న కథలు, నవలలు, బాల సాహిత్య రచనల్లో ఆమె ప్రతిభ కనబరిచారు.
జీవన జ్యోతి చిత్ర కథారచనకు నంది అవార్డు అందుకున్నారు. ఆమెకు 1957లో గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారం లభించింది. 1978లో ఉత్తమ జర్నలిస్టుగా రామానాయుడు అవార్డును జమీన్‌రైతు వారపత్రిక అందజేసింది. ‘నన్ను వెళ్లిపోనీరా’ నవలకు 1996లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పురస్కారం అందుకున్నారు. 1997లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ‘సమాజానికి సాహిత్య-సామాజిక సహకారం’పై గౌరవ డి.లిట్‌ను పొందారు. 1998లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు.
ఆరుద్ర మోసగాళ్లకు మోసగాడు సినిమాకు కథ అందించగా ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. మీనా, దేవదాసు సినిమాలకు కూడా రచనా పరంగా ఆరుద్ర సహాయం చేశారు. కె.రామలక్ష్మి సెన్సార్ బోర్డ్ మెంబర్ గానూ పని చేశారు. ఈ దంపతులు తెలుగు సాహితీ రంగానికి చేసిన సేవ ఎనలేనిది అని చెప్పాలి. కాగా ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Manchu Manoj Weddding : ఘనంగా మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి .. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
- World Obesity Day: ప్రపంచ జనాభాలో సగం మంది ఊబకాయులే.. తాజా సర్వేలో సంచలనాలు
- Ap Global Investors Summit : రెండవ రోజు ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023.. నేడు 1.15 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు!