Last Updated:

Agent Movie : అభిమానులను క్షమించమని కోరిన ఏజెంట్ నిర్మాత.. ఆ తప్పు వల్లే ఇలా అయ్యిందంటూ !

అక్కినేని అఖిల్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే, ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన

Agent Movie : అభిమానులను క్షమించమని కోరిన ఏజెంట్ నిర్మాత.. ఆ తప్పు వల్లే ఇలా అయ్యిందంటూ !

Agent Movie : అక్కినేని అఖిల్ హీరోగా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మించిన చిత్రం ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. అయితే, ఏప్రిల్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’.. ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. మొదటి ఆట నుంచే మూవీ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఏకె ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సుమారు రూ.80 కోట్ల బడ్జెట్ తో నిర్మించాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమాకి సహా నిర్మాతగా వ్యవహరించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరో కీలేక పాత్ర పోషించారు.

ఇక రిలీజైన మొదటి రోజు రూ.7 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. రెండవ రోజు కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఏజెంట్ డిజాస్టర్ గా నిలిచించి. ఇక ఈ సినిమాపై ఆడియన్స్ నుండి ఎన్నో రకాల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏజెంట్ ఫలితంపై సినిమా నిర్మాత అనిల్ సుంకర స్వయంగా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. తప్పు తమదేనంటూ.. అభిమానులను క్షమాపణలు కోరారు.

ఈ మేరకు ఆ ట్వీట్ లో.. ఏజెంట్‌ చిత్రంపై పడుతున్న నిందలన్నీ మేమే భరించాలి. ఇది చాలా కష్టమైన పని అని తెలిసినప్పటికీ గెలవాలని అనుకున్నాం. కానీ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్‌ ప్రారంభించి తప్పు చేయడం, కొవిడ్‌ సహా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో అలా చేయడంలో విఫలమయ్యాం. ఈ విషయంలో ఎలాంటి సాకులు చెప్పకూడదనుకుంటున్నాం. కానీ కాస్ట్‌లీ మిస్టేక్ నుంచి నేర్చుకుని, ఇలాంటివి ఎప్పటికీ రిపీట్ కాకుండా ఎలా తిరిగొస్తామో చూడండి. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు. మా భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో డెడికేటెడ్ ప్లానింగ్‌తో కష్టపడి నష్టాలను భర్తీ చేస్తాము’ అని ట్వీట్ చేశారు నిర్మాత అనిల్.

 

ఇక ప్రొడ్యూసర్ అనిల్ స్టేట్‌మెంట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. రిలీజ్‌కు ముందు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో నిర్మాత మాట్లాడిన మాటలను ఇప్పుడు గుర్తుచేస్తున్న నెటిజన్లు.. చురకలంటిస్తున్నారు. ‘స్క్రిప్ట్ సరిగా లేకుండా పాన్ ఇండియా లెవెల్‌లో అని ఎలా మాట్లాడారు అని సెటైర్లు వేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇప్పటి వరకు ఏ ప్రొడ్యూసర్ కూడా ఇలా సినిమా వైఫల్యాన్ని తనపై వేసుకోలేదని, నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు జాగ్రత్తలు తీసుకోండని సలహాలు ఇస్తున్నారు. అయితే నిర్మాతలు ఈ సినిమా కోసం అఖిల్‌కు ఉన్న మార్కెట్ కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. మమ్ముట్టి లాంటి స్టార్ హీరో కాస్టింగ్ ఉన్నా.. అఖిల్‌ కూడా తన బాడీని ట్రాన్స్‌ఫర్మేషన్ బాగా చేశాడు. పలు వైఫ్యల్యాల కారణంగా కూడా ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.