King Akkineni Nagarjuna : “నా సామిరంగ” అంటున్న కింగ్ నాగార్జున.. సంక్రాంతి బరిలో సై
కింగ్ అక్కినేని నాగార్జునకి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేడు 64 వ ఏటా అడుగుపెడుతున్న ఈ మన్మధుడుకి వయస్సు పెరిగేకొద్ది అందం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..అంచెలంచెలుగా ఎదుగుతూ

King Akkineni Nagarjuna : కింగ్ అక్కినేని నాగార్జునకి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేడు 64 వ ఏటా అడుగుపెడుతున్న ఈ మన్మధుడుకి వయస్సు పెరిగేకొద్ది అందం మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఏఎన్నార్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రి లోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగ్..అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో స్టేటస్ పొంది తొలివ్వవద కి కింగ్ అయ్యారు. కాగా ఇటీవల కాలంలో నాగార్జునకి సరైన హిట్ పడలేదనే చెప్పాలి.
ఆయన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్నాయి. ఈ మేరకు కొంచెం గ్యాప్ తీసుకున్న నాగ్ ఈసారి రెట్టింపు ఉత్సాహంతో మంచి మాస్ ఎంటర్ టైనర్ తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. కాగా నేడు నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే నాగ్ తన కెరీర్ లో ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ని ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమాతో మరో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు. తన 99 వ చిత్రానికి విజయ్ బిన్నీ అనే కొత్త దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నాడు. కాగా ఈ సినిమాకి “నా సామిరంగ” అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు మూవీ యూనిట్.
ఇక ఈ గ్లింప్స్ లో అరవై మంది రౌడీలు ఒక షెడ్డు లోపల ఉండగా.. విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అతనికి లోపలి వెళ్లగానే, విలన్ ని చూసి రౌడీలు అతని తల కావాలా? చేతులు నరకాలా? అని అడుగుతుండగా… ఒక రౌడీ లేచి అసలు ఎవడన్నా వాడు అనగానే విలన్ ‘కింగ్’ అని చెప్తాడు. దాంతో రౌడీలకి చెమటలు పట్టి భయపడుతూ ఉండగా టేబుల్ పైన దరువు వేస్తూ నాగార్జున రివీల్ అవ్వడం.. బ్యాక్ గ్రౌండ్ లో అదిరిపోయే మ్యూజిక్ యా అవ్వడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చివర్లో రౌడీలందరినీ కొట్టి షెడ్డు బయటకి వచ్చి బీడీ వెలిగించిన నాగార్జున “ఈ సంక్రాంతికి నా సామీ రంగ” అని చెప్పడంతో గ్లింప్స్ ముగుస్తుంది. ఈ అనౌన్స్ మెంట్ తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Naa Saami Ranga
Ippudu #KingMassJataraమొదలు
Our next with the King
@iamnagarjuna garu titled #NaaSaamiRanga
World Wide Release on Sankranti 2024
Here’s the Title Glimpse
https://t.co/0PuVDhdykA#HBDKingNagarjuna
@ChoreographerVJ @mmkeeravaani… pic.twitter.com/5k88K8XNei
— Srinivasaa Silver Screen (@SS_Screens) August 29, 2023