India vs Bangladesh : డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్… భారీ స్కోరు దిశగా ఇండియా !
India vs Bangladesh : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బంతిని బౌండరీల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ
India vs Bangladesh : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్లు రికార్డుల మోత మోగిస్తున్నారు. బంగ్లా బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బంతిని బౌండరీల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగి దుమ్ము దులిపేశాడు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కి కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవ్వడంతో 5 మ్యాచ్‌ల తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ చరిత్రకెక్కాడు.
డబుల్ సెంచరీతో చితక్కొట్టిన ఇషాన్…
35 వ ఓవర్ లో ముస్తాఫిజుర్ వేసిన చివరి బంతికి సింగిల్ తీసిన ఇషాన్ ఈ ఘనతను సాధించాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్… మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (3) విఫలమైనప్పటికి … మ్యాచ్ ని ముందుకు నడిపించాడు. విరాట్ కోహ్లీతో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడి 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్… మరో 36 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మరో 18 బంతుల్లోనే 150 పరుగుల మార్క్ ధాటిన ఇషాన్.. మరో 23 బంతుల్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం 131 బంతుల్లో వ్యక్తిగత స్కోరు 210 (10 సిక్స్ లు, 24ఫోర్లు) వద్ద అవుట్ అయ్యాడు.
దీంతో వన్డే క్రికెట్‌లో 200 పరుగులు చేసిన 7వ అంతర్జాతీయ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. ఇషాన్ కంటే ముందు 210 పరుగులతో ఉన్న క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్. ఈ డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత మరియు మొదటి వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ ఈ మైలురాయిని చేరుకున్నారు. కిషన్ కంటే ముందు ఫకర్ జమాన్, క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ 200 పరుగుల మార్కును చేరుకున్న విదేశీ క్రికెటర్లుగా నిలిచారు.
ఇషాన్ 22 అక్టోబర్ 2022న దక్షిణాఫ్రికాతో ఢిల్లీలో చివరి వన్డే ఆడాడు. బంగ్లాదేశ్‌లో సెంచరీ చేసిన 5వ భారత ఓపెనర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఈ ఘనత సాధించారు. ఇక బంగ్లాలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ పిచ్‌పై కిషన్ (210) అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ (185*) రికార్డును వదిలిపెట్టాడు. బంగ్లాదేశ్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ (183) మూడో స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి రెండో వికెట్‌కు 290 పరుగులు జోడించారు. ప్రస్తుతం 47 వ ఓవర్ జరుగుతుండగా భారత్ 390 – 6 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే 400 పరుగులు చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.