Algeria Wildfire: అల్జీరియాలో కార్చిచ్చు.. 10 మంది సైనికులతో సహా 25 మంది మృతి..

అల్జీరియాలో చెలరేగుతున్న కార్చిచ్చులో 25 మంది మరణించారు. వీరిలో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. వీరు అధిక గాలులు మరియు వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తెలిపాయి. మరో 25 మంది గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 01:13 PM IST

Algeria Wildfire: అల్జీరియాలో చెలరేగుతున్న కార్చిచ్చులో 25 మంది మరణించారు. వీరిలో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. వీరు అధిక గాలులు మరియు వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తెలిపాయి. మరో 25 మంది గాయపడ్డారు.

7,500 మంది అగ్నిమాపక సిబ్బంది..

అల్జీర్స్‌కు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు (60 మైళ్లు) దూరంలో ఉన్న బౌయిరాలో పెద్ద స్దాయిలో మంటలు చెలరేగాయని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.మంటలను అణిచివేసేందుకు చేపట్టిన ఆపరేషన్లలో దాదాపు 7,500 మంది అగ్నిమాపక సిబ్బంది మరియు 350 ట్రక్కులు పాల్గొన్నాయి. అల్జీరియా వేసవిలో కార్చిచ్చు సాదారణంగా జరుగుతుంటుంది. ట్యునీషియాతో అల్జీరియా ఉత్తర సరిహద్దు సమీపంలో గత ఆగస్టులో మంటలు చెలరేగడంతో కనీసం 37 మంది మరణించారు.