Last Updated:

చలపతిరావు: టాలీవుడ్ నాట మరో విషాదం.. సీనియర్ నటుడు చలపతిరావు ఇకలేరు

తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు టాలీవుడ్ దిగ్గజ నటుడు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరణ వార్త మరువక ముందే నేడు మరో ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు.

చలపతిరావు: టాలీవుడ్ నాట మరో విషాదం.. సీనియర్ నటుడు చలపతిరావు ఇకలేరు

Chalapathi Rao: తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు టాలీవుడ్ దిగ్గజ నటుడు నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరణ వార్త మరువక ముందే నేడు మరో ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు (78) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు.

1944 మే 8న ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా బల్లిపర్రులో చలపతిరావు జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు రవిబాబు ఉన్నారు. ఆయన సినీ పరిశ్రమలో దాదాపు 1,200 పైగా సినిమాలలో నటించారు. విలన్ గా, కమెడియన్ గా, సహాయ నటుడిగా పలు సినిమాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నిర్మాతగానూ 7 సినిమాలను నిర్మించారు.

senior actor chalapathi rao death

సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతిరావు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేశారు. 1966లో ‘గూడచారి 116’ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టారు. సంపూర్ణ రామాయణం, యమగోల, డ్రైవర్ రాముడు, బొబ్బిలి పులి, ప్రేమకానుక, బొబ్బిలి బ్రహ్మన్న, ఖైదీ వంటి హిట్ చిత్రాల్లో చలపతి రావు నటించారు. కలియుగ కృష్ణుడు, కడపరెడ్డమ్మ, జగన్నాటకం, అర్థరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఇకపోతే ఈయన కుమారు రవిబాబు సైతం టాలీవుడ్ నాట నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా చలపతిరావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అవును, అవును2, మనసారా, వంటి పలు చిత్రాలను రవిబాబు చేశారు.చలపతిరావు మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. రవిబాబు మరియు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.

Image

ప్రముఖ నటుడు చలపతిరావు మృతి చెందడం బాధాకరం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని, ప్రతినాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ తనదైన శైలిలో ఆయన ప్రేక్షకుల్ని అలరించారని పవన్ పేర్కొన్నారు. నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారని, ఆయన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు, ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని కళ్యాణ్ బాబు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్‌ నటులు ఒక్కొక్కరుగా ఇలా కాలం చేయడం దురదృష్టకరమని పవన్‌ పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి: