Home / సినిమా
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లూసిఫర్‌కి రీమేక్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాహో ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయనున్నారు. ప్రస్తుతానికి ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని మరియు పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.
బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉండడం కనిపిస్తుంది. తన అప్డేట్ అన్నీ అభిమానలతో నెట్టింట పంచుకుంటారు. అయితే ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా, ఇన్ స్టా వేదికగా జాన్వి చేసిన డ్యాన్స్ ఇప్పుడు కుర్రకారులో జోరుపుట్టిస్తుంది.
బాలీవుడ్ జంట అలియా భట్ మరియు రణబీర్ కపూర్లు కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో వీరిరువురు మంగళవారం రాత్రి ఉజ్జయినిలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర్ ఆలయానికి దర్శనానికి వచ్చారు. అయితే వీరిని గుడిలోకి ప్రవేశించకుండా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.
ప్రస్తుతం బుల్లితెర పై బిగ్ బాస్ కు ఉన్నా పాపులారీటి ఇంక ఏ షో కూడా లేదు. ఈ బిగ్ బాస్ షో కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికి తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకొని ఆరవ సీజన్లోకి అడుగుపెట్టింది.
బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ కు ఇంకా సమయం ఉంది. రెండు రోజుల బిగ్ బాస్ ని బట్టి ఎవరు నామినేషన్లో ఉంటారనేది షో చూస్తుంటే అర్దం అవుతుంది. మొదటి టాస్క్ ట్రాష్ క్లాస్ మాస్లో భాగంగా ఎవరు గెలిస్తే వారు బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ తెలిపారు.
సెప్టెంబర్ 4న బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో ప్రారంబమయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ కూడా నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్ బాస్ ఇంట్లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన విషయం తెలిసిన సంగతే. ఈ షోలో బాగా పాపులర్ ఐనవాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది.
బుల్లి తెర టీవీ యాంకర్‌గా తన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా ఒకరు. శివ కార్తికేయన్ కొత్త నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు చేయడానికి రెడీగా ఉన్నారని తెలిసిన విషయం. తెలుగు సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో నాగ చైతన్య , సమంత కు క్రేజ్ మామూలుగా లేదు ఒక రేంజులో ఉందనే చెప్పుకోవాలి. వీళ్ళద్దరు ఒకప్పుడు తెలుగు అభిమానుల ఆల్ టైమ్ ఫేవరేట్ కపుల్ గా ఉన్నారు. వీళ్ళు ప్రేమించుకొని ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారన్నా విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వీళ్ళ జంటను చూసి ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకోవాలిసి వచ్చింది.
దర్శకుడు సుధీర్ వర్మకొరియన్ రీమేక్ మిడ్నైట్ రన్నర్స్ యొక్క షూట్‌ను పూర్తి చేసాడు. ఈ చిత్రానికి శాకిని డాకిని అని పేరు పెట్టారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.