Last Updated:

Jinnah movie: జిన్నా మూవీ నుంచి “జారు మిఠాయి” సాంగ్ రిలీజ్

విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా జిన్నా. నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Jinnah movie: జిన్నా మూవీ నుంచి “జారు మిఠాయి”  సాంగ్ రిలీజ్

Jinnah movie: విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా జిన్నా. నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా విష్ణు మంచు మరియు సన్నీ లియోన్ పై చిత్రీకరించిన మాస్ మసాలా పాట “జారు మిఠాయి” పాట లిరికల్ వీడియో ను విడుదల చేసారు. ఈ పాట ఐటెం సాంగ్ అనుభూతిని కలిగిస్తుంది.

ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా ఎ.గణేష్ లిరిక్స్ రాసారు. సింహ మరియు నిర్మల రాథోడ్ పాటను పాడారు. ఈ రొమాంటిక్ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టారు తన మాస్ స్టెప్ లతో పాటకి ప్రాణం పోశారు. ఈ చిత్రం లో పాటలు సరిగమ తెలుగు ఆడియో ద్వారా విడుదల అవుతున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగాయి. విష్ణు ఈ చిత్రం పై బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ట్రైలర్ కు 3 కోట్ల వ్యూస్ వచ్చాయి.

ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ & 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డా.ఎం మోహన్‌బాబు ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించారు. సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. ఛోటా కె ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. జిన్నా చిత్రం అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఇవి కూడా చదవండి: