Last Updated:

Game Changer: గేమ్‌ ఛేంజర్‌లో చిన్న మార్పు – సినిమాలో కనిపించని నానా హైరానా!

Game Changer: గేమ్‌ ఛేంజర్‌లో చిన్న మార్పు – సినిమాలో కనిపించని నానా హైరానా!

Naanaa Hyraana Song Edited From Theatre: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్‌ షో నుంచి ఈ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్‌కి థియేటర్లో షాక్‌ తగిలింది. యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌ అందుకున్న నానా హైరానా కనిపించలేదు. దీంతో ఆ పాట ఏమైందా? అనే డైలామాతో ఆడియన్స్‌ థియేటర్‌ నుంచి బయటకు వస్తున్నారు.

దీంతో పాటను ప్రదర్శించకపోవడంపై తాజాగా మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. మూవీ ప్రమోషన్స్‌లో ప్రచారంలో భాగంగా విడుదలైన పాటల్లో భారీ విజయం సాధించిన సాంగ్‌ ‘నానా హైరానా’. విడుదలైనప్పటి నుంచి ఈ పాట యూట్యూబ్‌లో మారుమ్రోగుతూనే ఉంది. దీంతో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. మ్యాజిక్‌ మెలోడితో సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ పాటను మూవీ టీం ప్రదర్శించలేదు. దీనికి కారణం చెబుతూ తాజాగా ఓ ప్రకటన ఇచ్చింది టీం.

నిజానికి శంకర్‌ సినిమాలు అంటే అందులోని పాటలకు ఎదోక ప్రత్యేకత ఉంటుంది. ఆ పాటల్లో శంకర్‌ మార్క్‌ కనిపిస్తుంది. అలాగే గేమ్‌ ఛేంజర్‌లోనూ తన మార్క్‌ ఉండేలా నానా హైరానా పాటను డిజైన్‌ చేశాడు శంకర్‌. ఇందుకోసం ఫస్ట్‌ టైం ఓ అత్యాధునిక టెక్నాలజీని వాడి భారీ బడ్జెట్‌తో పాటను రూపొందించారు. “నానా హైరానా పాటను ఇన్‌ఫ్రా రెడ్ కెమెరాతో షూట్‌ చేశారు. ఈ టెక్నాలిజీని మొదటి సారిగా ఈ పాట కోసం వాడారు. అయితే టెక్నికల్‌ సమస్యల వల్ల ఈ పాటను సినిమాలో యాడ్‌ చేయలేకపోయారట. ప్రస్తుతం ఈ పాట వర్క్‌ జరుగుతుంది. ఇందుకోసం మా టీం రాత్రి పగలు శ్రిమిస్తుంది. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్‌ను మూవీలో యాడ్‌ చేస్తాం” టీం తెలిపింది.

ఇదిలా ఉంటే థియేటర్‌ గేమ్‌ ఛేంజర్‌కి మంచి టాక్‌ వస్తుంది. ఇండియన్‌ 2 డిజాస్టర్‌తో అభిమానులు గేమ్‌ ఛేంజర్‌ విసయంలో ఆందోళన చెందారు. కానీ, సినిమాకు వస్తున్న టాక్‌ చూస్తుంటే ఈ సంక్రాంతికి హిట్‌ ట్రాక్‌లో గేమ్‌ ఛేంజర్‌ పడినట్టే కనిపిస్తుంది. రోటిన్‌ పొలిటికల్‌, థ్రిల్లర్‌ అయినా చరణ్‌ యాక్టింగ్‌, యాక్షన్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అంటున్నారు. చెప్పాలంటే గేమ్ ఛేంజర్‌ మొత్తాన్ని చరణ్‌ తన భుజాన వేసుకుని నడిపించారంటూ రివ్యూస్‌ వస్తున్నాయి. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమారు రూ. 450 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు సమాచారం. ఇందులో చరణ్‌ జోడిగా కియారా అద్వాని నటించింది.

ఇవి కూడా చదవండి: