Last Updated:

Janhvi Kapoor: శ్రీవారిని దర్శించుకున్న జాన్వి కపూర్

ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు.

Janhvi Kapoor: శ్రీవారిని దర్శించుకున్న జాన్వి కపూర్

Bollywood: ఈ మధ్య సినీ ఫీల్డ్ లో కొత్త ట్రెండు నడుస్తుంది అది ఏంటంటే సినిమా విడుదల అయ్యే ముందు, విడుదల అయ్యాక, సినిమా మంచి విజయం సాధించినప్పుడు దేవుని ఆశీస్సులు కోసం దేవుని గుళ్ళకు వెళ్తున్నారు. సాధరణంగా అన్నీ సినిమా వర్గాల వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలాగే అలనాటి అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ నిన్న తిరుమల వారిని దర్శించుకుంది. అలాగే జాన్వీ స్వామివారి సేవలో కూడా పాల్గొన్నారు. తన స్నేహితురాలితో కలిసి విఐపి దర్శనం ద్వారా తన మొక్కులను చెల్లించుకున్నారు. ఈ అమ్మడు మన తెలుగు సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. బ్లూ కలర్‌ లంగా ఓణీలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. లంగా వోణిలో ఆమెను అలా చూస్తుంటే రోజు లంగా వోణి కనిపిస్తే చాలా బావుండని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దర్శనం అయిన తరువాత అక్కడ ఉండే పూజారులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

తన ఖాళీ సమయంలో జాన్వీ కపూర్ తిరుమల వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో జాన్వి నటించి గుడ్‌లఖ్‌ జెర్రీ సినిమా ఓటీటీలో విడుదలా అయి మంచి విజయం సాదించింది. ప్రస్తుతం ఆమె నటించిన బవాల్ అనే సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని విడుదలకు కూడా సిద్ధమౌవుతోందని తెలిసిన సమాచారం. ఈ సంధర్భంగా షూటింగ్‌ నుంచి కొంత విరామం తీసుకొని జాన్వీ స్వామి వారిని దర్శించినట్లు తెలిపారు. బవాల్ సినిమా మాత్రమే కాకుండా కాగా ప్రస్తుతం ఆమె మిస్టర్ అండ్ మిస్ మహి అనే సినిమా షూటింగ్ కూడా చేస్తుందని తెలిసిన సమాచారం.

ఇవి కూడా చదవండి: