Last Updated:

Bigg Boss Season 6: ఇనయను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్?

బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ బాగా ఆడే వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తారు. వారిని ప్రజలు గుర్తిస్తారన్న లోపే వాళ్ళు ఇంటి బయట ఉంటున్నారు.

Bigg Boss Season 6: ఇనయను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్?

Big Boss Season 6: బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ ప్రాసెస్ రసవత్తరంగా సాగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ బాగా ఆడే వాళ్ళని ఇంటి నుంచి గెంటేస్తారు. వారిని ప్రజలు గుర్తిస్తారన్న లోపే వాళ్ళు ఇంటి బయట ఉంటున్నారు. మూడో వారంలో ఇనయ ఎలిమినెట్ అవుతుందని సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. షాని, అభినయ శ్రీ ఎలిమినెట్ చేయగా వారు బయటికి వచ్చారు. మూడో వారంలో మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు. సుదీప, ఆరోహి,ఇనయ సుల్తానా, వాసంతి, నేహా, గీతూ, చలాకీ చంటి, శ్రీహన్, రేవంత్, బాలదిత్య ఉన్నారు.

పైన చెప్పిన 10 మంది నామినేషన్స్ లో ఉండగా, ప్రతి వారం లాగే ఈ సారి కూడా రేవంత్ ఎక్కువ ఓటింగ్స్ తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో శ్రీహన్, చలాకీ చంటి, గీతూ కూడా ఓటింగ్స్ బాగానే పడుతున్నాయి. కెప్టెన్సీ టాస్క్ నుంచి ఓటింగ్స్ మొత్తం తారుమారు అయ్యింది. ఇనయ ఒక్కటే ఒంటరి పోరాటం చేస్తుంది.

శ్రీహన్ తో జరిగిన గొడవలో ఇనయ నోరేసుకొని పడిపోయిందని అందరూ ఇనయ మీద పడ్డారు. నెటిజన్లు అందరూ ఇనయకు సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇనయ అన్న దానిలో ఏమి తప్పుంది. శ్రీహన్ కు ఎందుకు అంత కోపం వచ్చింది. శ్రీహన్ తనని పిట్ట అని ఏడిపించవచ్చు. కానీ తను మాత్రం ఎవరిని ఏమి అన్నా, అది తప్పు కిందకు వస్తుందా? ఇనయను ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదు బిగ్ బాస్ ?అని అందరూ అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి: