Last Updated:

Animal Movie : యానిమల్ నుంచి “అమ్మాయి” సాంగ్ రిలీజ్.. లిప్ కిస్ లతో రెచ్చిపోయిన రణబీర్, రష్మిక

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు

Animal Movie : యానిమల్ నుంచి “అమ్మాయి” సాంగ్ రిలీజ్.. లిప్ కిస్ లతో రెచ్చిపోయిన రణబీర్, రష్మిక

Animal Movie : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం “యానిమల్”. బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ టీజర్, ట్రైలర్ చూస్తే.. సందీప్ చెప్పినట్టుగానే ఒక రేంజ్ వైలెన్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో.. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే ‘కబీర్ సింగ్’ మూవీతో భారీ సక్సెస్ అందుకున్న సందీప్.. ఇప్పుడు ‘యానిమల్’తో రికార్డులు తిరగరాయడం పక్కా అనిపిస్తుంది.  ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో మేకర్స్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇక తాజాగా ‘యానిమల్’ (Animal Movie) నుంచి ఫస్ట్ సాంగ్​ని రిలీజ్ చేశారు. హజంగా కొత్త సినిమాల నుంచి మేకర్స్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు. కానీ ‘యానిమల్’ మేకర్స్ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసేశారు. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాట ఫుల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ సర్​ప్రైజ్ ఇచ్చారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రాఘవ్ చైతన్య, ప్రీతమ్ పాడారు.

దాదాపు 2 నిమిషాల 45 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట​లో రణబీర్, రష్మికల మధ్య లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోవడంతో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. సాంగ్ ని గమనిస్తే.. రణ్​బీర్​ను తీసుకొచ్చి రష్మిక తను లవ్ మ్యాటర్​ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే.. వాళ్లు ఒప్పుకోకపోవడంతో వాళ్ల ముందే ఇద్దరూ లిప్ కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫ్లైట్ లో రొమాన్స్ చేసుకుంటారు. మంచుకొండపై ఉన్న ఓ గుడిలో పెళ్లి చేసుకోవడం.. చూపించారు. ఈ పాట చూస్తుంటే అర్జున్ రెడ్డి మూవీ గుర్తుకు వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం (Animal Movie) ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: