Ather Energy: ఓలాతో పోటీకి దిగిన ఏథర్.. మార్కెట్ లోకి కొత్త బేస్ వేరియంట్
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో
Ather Energy: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ నుంచి మరో స్కూటర్ రాబోతుంది. ప్రస్తుతం ఏథర్ కంపెనీ నుంచి 450 శ్రేణిలో రెండు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. 450 ఎక్స్ పేరుతో స్టాండర్డ్ వేరియంట్ విక్రయిస్తుండగా.. మరిన్ని సదుపాయాలతో ప్రో ప్యాక్ పేరుతో మరో స్కూటర్ విక్రయిస్తోంది. ఈ క్రమంలో కొత్తగా 450 సిరీస్‌లో 450 S పేరుతో ఇంకో స్కూటర్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ఏథర్ 450 ఎస్ ధర (Ather Energy)
ఏథర్ 450 ఎస్ గరిష్టంగా 90 కిలో మీటర్ల వేగంతో వెళుతుంది. దీనికి ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 115 కిలో మీటర్లు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. త్వరలో ఈ స్కూటర్ మార్కెట్ లోకి విడుదల కానుందని కంపెనీ పేర్కొంది. ఏథర్ 450 ఎస్ ధరను రూ. 1,29,999 గా కంపెనీ నిర్ణయించింది. ఓలా కు పోటీగా ఏథర్ ఈ కొత్త స్కూటర్ ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈవీ వాహనాలపై సబ్సిడీ కోత (Ather Energy)
మరో వైపు విద్యుత్ వాహనాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీలో కోత విధించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈవీ వాహన ధరల పెరిగాయి. ఒక్కో స్కూటర్‌పై రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు రేట్లు అధికమయ్యాయి. ఏథర్ 450 ఎక్స్ మోడల్ హైదరాబాద్‌లో సబ్సిడీ తర్వాత రూ. 1,46,559 గా ఉంది. అదే విధంగా ప్రో ప్యాక్ ధర రూ. 1,67,073గా ఉంది. అంటే ప్రస్తుతం ఏథర్ నుంచి ఏ మోడల్ తీసుకున్నా రూ. లక్షన్నర వరకు పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 450 S రూపంలో తక్కువ ధరలో స్కూటర్‌ను తీసుకువస్తోంది ఏథర్.