Best Sporty Bikes Under 2 Lakhs: బెస్ట్ స్పోర్ట్స్ బైక్ కొనాలా? రూ. 2 లక్షల్లో టాప్-5 బైక్స్ ఇవే!
Best Sporty Bikes Under 2 Lakhs: భారతదేశంలో మంచి మైలేజ్, స్పోర్టీ రైడ్ అందించే బైక్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందులో హోండా, యమహా, టీవీఎస్, బజాజ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు ఉన్నాయి. ఇవి బెస్ట్ మైలేజ్, ఫీచర్లను అందిస్తాయి. అంతే కాకుండా వీటిని రూ.2 లక్షల్లోపు ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ క్రమంలో అటువంటి ఐదు బైక్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హోండా హార్నెట్ 2.0
కొత్త హోండా హార్నెట్ 2.0 బైక్ లీటరుకు 42.3 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌లో 184సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ 17బిహెచ్‌పి పవర్, 15.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది.
హోండా హార్నెట్ 2.0లో 276 mm డిస్క్ బ్రేక్‌తో ముందు భాగంలో USD ఫోర్క్, వెనుకవైపు 220 mm డిస్క్ బ్రేక్‌తో మోనోషాక్ ఉంది. హోండా ఈ బైక్‌లో సింగిల్-ఛానల్ ABS మాత్రమే అందిస్తుంది. ఈ బైక్ ధర భారతదేశంలో స్-షోరూమ్ ధరగా రూ.1.40 లక్షలు.
పల్సర్ ఎన్ఎస్200
కొత్త పల్సర్ ఎన్ఎస్200 బైక్ లీటరుకు 40.36 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని 199.5సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ 24బిహెచ్‌పి పవర్, 18.74ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ఈ స్పోర్టీ కమ్యూటర్ బైక్ ధర రూ.1.54 లక్షలు ఎక్స్-షోరూమ్. బైక్ ముందు భాగంలో USD ఫోర్క్, 300mm డిస్క్ బ్రేక్, Nitrox మోనోషాక్, వెనుక 230mm డిస్క్ బ్రేక్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABS కూడా అందించారు.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ
ఈ బైక్ ధర రూ.1.48 లక్షల ఎక్స్-షోరూమ్. లీటరుకు 41.9 కిమీ మైలేజీని ఇస్తుంది. RTR 200 4V బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. ఈ బైక్‌లో 197.8సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజన్ 20బిహెచ్‌పి పవర్, 17.25ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
యమహా ఎమ్‌టీ 2.0
దీని ప్రారంభ ధర రూ.1.68 లక్షలు, ఎక్స్-షోరూమ్. ఇది 47.94 kmpl మైలేజీని అందజేస్తుందని ARAI ధృవీకరించింది. ఇది 18 బిహెచ్‌పి పవర్, 14.1 ఎన్‌ఎయమ్ టార్క్ ఉత్పత్తి చేసే 155 cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
కేటీఎమ్ 200 డ్యూక్
ఇది 35 kmpl ARAI సర్టిఫైడ్ మైలేజీని ఇస్తుంది. ఇది 24 బిహెచ్‌పి, 19.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 199.5 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీని ధర రూ.1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ఇండియా. 6 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది.