Chetak EV 2023: సరికొత్త చేతక్ ఈవీని లాంచ్ చేసిన బజాజ్.. ధర ఎంతంటే?
2023 ఎడిషన్ గా తీసుకొచ్చిన ఈ స్కూటర్ లో డిజైన్ పరంగా కూడా కొన్నొ మార్పులు చేసి తీసుకొచ్చింది.

Chetak EV 2023: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో తన చేతక్ ప్రీమియం మోడల్ ఈవీ 2023 (Chetak electric scooter) ఎడిషన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. 2023 ఎడిషన్ గా తీసుకొచ్చిన ఈ స్కూటర్ లో డిజైన్ పరంగా కూడా కొన్నొ మార్పులు చేసి తీసుకొచ్చింది.
ఈ కొత్త ఈవీ ధర కూడా ప్రీమియంగా నిర్ణయించింది. ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 1.52 లక్షలుగా (ఎక్స్ షోరూం) గా కంపెనీ తెలిపింది.
ఇప్పటికే మార్కెట్ లో ఉన్న చేతక్ ప్రీమియం ఈవీ రూ. 1.22 లక్షల ధరలో లభిస్తోంది.
సరికొత్త ఫీచర్స్ తో(Chetak EV 2023)
రెండు వేరియంట్స్ ఈ కొత్త చేతక్ అందుబాటులో ఉన్నాయి. కొత్త స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే మొదలవగా, ఏప్రిల్ నుంచి డెలివరీలు అందించనున్నట్టు కంపెనీ పేర్కొంది.
కొత్త చేతక్ తో పాటు పాత మోడల్ కూడా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
పూర్తి అత్యాధునిక ఫీచర్స్ పాటు ప్రీమియం పరికరాలతో కొత్త చేతక్ ఈవీని రూపొందించారు. బ్లూ, గ్రే, బ్లాక్ కలర్లలో ఈ స్కూటర్ లభిస్తోంది.
కొత్తగా చేసిన మార్పుల్లో ముఖ్యంగా వెహికల్ సమాచారం ఉండే మెరుగైన ఎల్సీడీ డిస్ ప్లే అందించామని కంపెనీ వెల్లడించింది.
ఒకసారి ఛార్జింగ్ తో 90 కిలో మీటర్లు
ఇది కాకుండా ప్రీమియం( Chetak EV 2023) డబుల్ టోన్డ్ సీట్, నాణ్యమైన ఫుట్ రెస్ట్, స్కూటర్ రంగుకు అనుగుణంగా మిర్రర్స్ ఉన్నాయి.
న్యూ వెర్షన్ స్కూటర్ లో.. బ్యాటరీలో గానీ, మోటార్ లో గానీ ఎలాంటి మార్పులు చేయలేదు.
ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఈ స్కూటర్ 90 కిలో మీటర్లు ప్రయాణించవచ్చని బజాజ్ పేర్కొంది.
కొత్తగా చేసిన మార్పులతో చేతక్ ప్రీమియం ఈవీ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో గేమ్ ఛేంజర్ అవుతుందని కంపెనీ భావిస్తోంది.
అదే విధంగా ఎలక్ట్రానిక్ సెగ్మెంట్ లో ఉత్పత్తిని పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- Vladimir Putin: లగ్జరీ ఎస్టేట్ లో.. లవర్ తో పుతిన్ రహస్య నివాసం..
- Water For Health: నీరు తాగేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తున్నారా?