Boult Swing Smartwatch: మార్కెట్ లోకి బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్.. ధర ఎంతంటే..
భారత మార్కెట్ లోకి బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ కాలింగ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే డిస్ప్లేతో ఈ వాచ్ లాంచ్ అయింది.
Boult Swing Smartwatch: భారత మార్కెట్ లోకి బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ కాలింగ్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండే డిస్ప్లేతో ఈ వాచ్ లాంచ్ అయింది. ఈ వాచ్ లో బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ వాచ్ సేల్ ఇప్పటికే ప్రారంభమైంది. బోల్ట్ స్వింగ్ స్మార్ట్ వాచ్ ఫీచర్స్, పూర్తి వివరాలివే..
ధర, ఫీచర్లు ఇవే(Boult Swing Smartwatch)
బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,799గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్ సేల్‌లో ఉంది. బ్లూ, బ్లాక్, బీక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.
1.9 ఇంచుల హెచ్డీ స్క్వేర్ షేప్ డిస్ప్లేతో బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. గరిష్ఠంగా 1000 నిట్స్ వరకు బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది.
డిస్ప్లే ఈ వాచ్‌కు హైలైట్‌గా ఉంది. 150కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఇక బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‌లో స్పీకర్, మైక్ అందుబాటులో ఉన్నాయి.
బ్లూటూత్ తో ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడుకునే వీలు ఉంది. నోటిఫికేషన్లను కూడా వాచ్ ద్వారా పొందవచ్చు.
ఈ వాచ్ ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని బోల్ట్ కంపెనీ వెల్లడించింది. బ్లూటూత్ కాలింగ్ కోసం వాడితే తక్కువే రావొచ్చు.
రెండు గంటల్లోగా ఈ వాచ్ ఫుల్ చార్జ్ అవుతుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.1 వెర్షన్‌ను కలిగి ఉంది. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ67 రేటింగ్‌ను ఈ వాచ్ కలిగి ఉంది.
హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ మానిటరింగ్, బ్లడ్ ప్లజర్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లను బోల్ట్ స్వింగ్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది.
100కు పైగా స్పోర్ట్స్ మోడ్లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.