Home /Author VijayAnand Avusula
Uttarakhand helicopter crash: ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మరణించారనే వార్త చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా సమీక్షించి, యాత్రికుల భద్రతకు, వారి ప్రాణాలకు భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి చేశారు. […]
Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 20కిపైగా మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. ఇంద్రాయణి బ్రిడ్జ్ కూలిన ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ప్రమాదం విషయం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న డివిజనల్ […]
Electric shock: జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వినాయక విగ్రహాల తయారీ కేంద్రం వద్ద 9 మందికి విద్యుత్ షాక్ కొట్టింది. ఎనిమిది మందికి కరెంట్ షాక్ కొట్టగా.. కట్టెతో కాపాడే ప్రయత్నం చేసే మరొకతనికి కూడా విద్యుత్ షాక్ తగిలింది. చికిత్స పొందుతూ వినోద్ , సాయి అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు […]
Heart Attack Symptoms: గుండె పోటును ముందే గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చు. కాళ్లల్లో, చేతుల్లో వచ్చే సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. గుండె పోటు అనేది గుండెకు రక్త ప్రవాహం ఎక్కువైనప్పుడు వస్తుంది. దీంతో పాటుగా కొవ్వు పేరుకుపోవడం మరియు కొలెస్ట్రాల్ వంటి వివిధ కారణాల వల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మనుషులు జబ్బుల వలన మరణించడానికి ప్రధాన కారణాలలో గుండె జబ్బు కూడా ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం 2019లో 17.9 […]
Thalliki Vandanam: తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది.. తెలుగా ఆడపడుచుల కళ్లలో ఆనందం చూసి మాజీ సీఎం జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తల్లుల పేరుతో లీలలు వంధనం వింతలు అని మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని లోకేష్ మండిపడ్డారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న […]
Walking with Barefoot on Grass: ప్రతీ రోజు ఉదయం గడ్డిమీద చెప్పులు లేకుండా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. గడ్డిమీద నడవడం వలన ఐదు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీరోజు తెల్లవారుజామున గడ్డిమీద నడవాలంటున్నారు. దీనినే గ్రౌండింగ్, ఎర్తింగ్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ప్రయోజనాలను అందిస్తుంది. 1. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది ఉదయం గడ్డి మీద నడవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయపు చల్లని గాలి, […]
Black Kismis for Eye Sight: నల్ల ఎండుద్రాక్షా (నల్ల కిస్ మిస్) కంటి చూపుకు చాలా ఉపయోగకరం. ఇది దృష్టిని మెరుగుపరచడంతోపాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇది రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే చాలా ప్రయోజనం లభిస్తుంది. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి కళ్ళు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌ను అధికంగా ఉపయోగించడం అలవాటైంది. దీని ప్రభావం కళ్ళపై ఉంటుంది. దీని కారణంగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కిస్ మిస్ […]
Health Benefits of Jamun Seed Powder: జామూన్ గింజల పొడితో షుగర్ ను నియంత్రించవచ్చు. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు సహాయపడుతుంది. జామున్ తీపి, పుల్లగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. వేసవిలో ఇవి విరివిగా దొరుకుతాయి. అయితే జామున్ లోని గుజ్జును తిని విత్తనాలను పారవేస్తారు. కానీ… జామున్ గింజలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. జామున్ పండులా, విత్తనాలు కూడా పోషకాలతో […]
Artist Chintalapalli Kotesh Painting on Ahmedabad Plane Crash: నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై స్పందించి ఒక ఉహాచిత్రాన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపిందన్నారు.. తాను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయందోళనతో అర్తనాదాలతో , గుర్తుపట్టలేని […]
Atchannaidu at Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో మామిడి రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలోని ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మామిడి రైతుల సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు మామిడి రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, వ్యాపారులు ఇచ్చేదానికంటే అదనంగా.. ప్రభుత్వం తరఫున రైతులకు కేజీకి రూ.4 చెల్లించేలా […]