Home /Author M Rama Swamy
Former Minister Harish Rao meets KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మరోసారి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఇద్దరూ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై చర్చించారు. బుధవారం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విచారణ అంశంపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. హరీశ్‌రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో […]
NCP (SP) President Sharad Pawar : నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముక్కలవుతుందని కలలోనైనా ఊహించలేదని ప్రస్తుత ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. పార్టీ చీలిపోయినా సవాళ్లను ఎదుర్కొని కార్యకలాపాలను ముందుకెళ్లిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఎన్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రారంభం నుంచి పార్టీ ఎన్నో సవాళ్లు, ఒడిదొడుకులను ఎదుర్కొందని చెప్పారు. అయినా నిరుత్సాహపడకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. పార్టీ ముక్కలవుతుందని అసలు […]
Karnataka Government : సిద్ధరామయ్య ప్రభుత్వానికి అధిష్ఠానం కీలక సూచన చేసింది. రాష్ట్రంలో మరోసారి కులగణన చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. నిర్ణీత కాలపరిమితి లోగా తిరిగి కులగణన చేపట్టాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సూచించింది. మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సీఎం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ 12న కర్ణాటక కేబినెట్.. సమావేశం అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
Engineering counseling : జులై మొదటివారంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆగస్టు 14లోగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. అనుమతి లేకుండా కొందరు విద్యాసంస్థలు నడుపుతున్నారని పేర్కొన్నారు. అందులోనే విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. నెక్స్ట్ వేవ్, బైట్ ఎక్స్ఎల్ టెక్ ఎడ్, లీప్ స్టార్ట్, ఇంటెల్లిపాత్ సంస్థలకు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వివరణ కోసం ఈ నెల 13వ తేదీ వరకు విద్యాసంస్థలకు గడువు ఇచ్చామన్నారు. […]
Farooq Abdullah travels in Vande Bharat train : జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్-కట్‌ఢా మార్గంలో ఇటీవల వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించగా, మంగళవారం ట్రైన్లో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రయాణించారు. దేశ రైల్వే నెట్‌వర్క్‌తో కశ్మీర్ మొత్తం అనుసంధానం కావడాన్ని చూసి తన కళ్లు చెమ్మగిల్లాయన్నారు. జులైలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్నదని, భక్తులు ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. వైష్ణోదేవీ ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారని ఆశాభావం వ్యక్తం […]
CM Chandrababu Naidu review : గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని తెలిపారు. 100 శాతం మార్పు కనిపించాలని ఆదేశించారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా సీఎం తెలుసుకున్నారు. కేసుల్లో నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. విచారణ పూర్తి చేసి […]
AP PCC President YS Sharmila : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అమరావతి మహిళలపై సజ్జల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. వైసీపీ చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తోందని తెలిపారు. సజ్జల కుమారుడు భార్గవ్‌రెడ్డి సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని తనపై కూడా దుష్ప్రచారం చేశారని […]
Karnataka : మూడా స్థలాల కేటాయింపులో భారీ కుంభకోణం జరిగింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూ.100 కోట్ల మార్కెట్ విలువైన 92 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు రూ.400కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులు సహకార సంఘాల పేరుతో నమోదయ్యాయని తెలిపారు. ముడా అధికారులతో సహా పలువురు బడా వ్యక్తులకు బినామీలుగా ఉన్న వ్యక్తులపై ఆస్తులు ఉన్నాయని ఏజెన్సీ ఆరోపించింది. ఇప్పటివరకు తాత్కాలికంగా […]
Vienna : ఆస్ట్రియాలోని గ్రాజ్ సిటీలో ఉన్న లెండ్ ప్రాంతంలోని పాఠశాలలో కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 8 మంది మృతిచెందారు. షూటింగ్ ఘటనకు దీటుటా పోలీసులు స్పందిస్తున్నారు. షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కాల్పుల్లో అనేక మంది గాయపడ్డారు. ఇందులో విద్యార్థులు, టీచర్లు ఉన్నట్లు తెలిసింది. ఓ వీధిలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ప్రాంతంలో సెకండరీ పాఠశాల ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు కాల్పుల ఘటనపై […]
Telangana CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై వారితో చర్చించారు. పలువురు మంత్రుల శాఖల్లో మార్పు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. […]