Home /Author M Rama Swamy
MLC Kalvakuntla Kavitha: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలంగాణ సర్కారు ప్రకటించడాన్ని బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో సర్కారు నిర్ణయం తీసుకుందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి జాగృతి శ్రేణులతో ర్యాలీగా లోయర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. అక్కడే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనుమానాలు […]
HCA President Jaganmohan Rao Remanded: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావుకు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. హెచ్‌సీఏ అధ్యక్ష ఎన్నికలో అక్రమాలు.. […]
Sathya Sai Centenary Celebrations: సత్యసాయి శత జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భేటీలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మంత్రులు నారా లోకేశ్, సవిత, సత్యకుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్, ప్రభుత్వం సంయుక్తంగా శత జయంతి వేడుకలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. […]
Former Prime Minister of Bangladesh Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ గురువారం అభియోగాలు మోపింది. అభియోగాలపై ఆగస్టు 3న విచారణ చేపట్టనుంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, మాజీ హోం మంత్రి అసదుజ్జామన్ కాన్ కమల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌధ్రీ అబ్దుల్లా అల్ మమున్‌పై ఐసీటీ నేరాభియోగాలు మోపిందని ప్రాసిక్యూషన్ లాయర్ మీడియాకు వెల్లడించారు. విద్యార్థుల ఆధ్వర్యంలో […]
Prasanna Kumar Reddy Comments: తాను ఎక్కడికీ పారిపోలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. చేతికి నొప్పి ఉండటంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చానని తెలిపారు. కొంతమంది తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గురువారం నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. నాది నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి బ్లడ్.. భయపడటం తమ బయోడేటాలో లేదన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు కావాలన్నా తనను అరెస్టు […]
Income Tax 2025 New Rules: మీరు ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా.. ఒకసారి కొత్తగా మారిన రూల్స్ గురించి తెలుసుకోండి. ఆదాయపు పన్నుశాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేయడానికి ఓటీపీ ప్రమాణీకరణని తప్పనిసరి చేసింది. కొత్త విధానాన్ని భద్రతను పెంచడం, దుర్వినియోగాన్ని నివారించడానికి ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుతం పన్ను చెల్లింపుదారుల వివరాల గుర్తింపును నిర్ధారించడం కోసం అమలులోకి వచ్చింది. మార్పులు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడానికి ఉద్దేశించినవి. […]
Bill Gates: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో ఏఐ విస్తరించింది. దీంతో ఏఐ వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ ఏఐ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించి, వారి స్థానాల్లో ఏఐని వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఆందోళన […]
AP Govt: ఏపీలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2027 మార్చి 1వ తేదీ నుంచి ఏపీవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు గురువారం జీఎడీ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఆదేశాలు జారీ చేశారు. కేంద్రం జారీ చేసిన జనగణన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ ప్రభుత్వం తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16వ తేదీన కేంద్ర హోం శాఖ […]
Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షత జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. గత మంత్రివర్గ సమావేశంలో మూడు నెలలకోసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్‌గా నిర్వహించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు జరిగిన 18 మంత్రిమండలి సమావేశాల్లో తీసుకున్న 327 నిర్ణయాలు, వాటి అమలుపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ను ఈ సమావేశంలో సమర్పించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మేడిగడ్డ […]
BJP Telangana State President N.Ramachandra Rao: హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు, బాధితులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు డిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఘటనలో అనధికారికంగా ఆరుగురు మృతి చెందారని, ఒకటి రెండు సీసాల కల్లు తాగిన వారి కిడ్నీలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కల్తీ కల్లులో సైకో ట్రాఫిక్ సబ్ స్టన్స్ కలిపినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఎక్సైజ్ శాఖ కల్లు […]