Home /Author M Rama Swamy
CM Revanth Reddy inaugurated Hydra Police Station : నగరంలోని బుద్ధ భవన్లో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోయి ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ర్పచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు […]
Sirens blare in Islamabad : భారత్ సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్ యత్నించింది. దీంతో మన సైన్యం పాక్‌కు గట్టి సమాధానిచ్చింది. పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను టార్గెట్ చేసుకొని విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని నగరం ఇస్లామాబాద్‌లో సైరన్ల మోత మోగింది. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం. పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్ తర్వాత […]
Gas cylinder explodes in Rajasthan : బంగారం దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలి 8 మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ బికనీర్ జిల్లాలోని మదాన్ మార్కెట్ ఏరియాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలుడు ధాటికి దుకాణం ఉన్న భవనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. బంగారం దుకాణంలోని గ్యాస్ స్టవ్‌పై పాత బంగారం, వెండిని కరిగించేందుకు వ్యాపారి మరగబెడుతున్నాడు. ఒక్కసారిగా సిలిండర్ పేలిపోయిందని […]
TGSRTC : శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీనిచ్చింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తోంది. బస్సుల్లో కండక్టర్లు వివిధ కండీషన్లు పెడుతున్నారు. దీంతో కండక్టర్లు మహిళలకు గొడవలు జరుగుతున్నాయి. సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. దీంతో మహాలక్ష్మి పథకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు చెందిన మహిళలు ఆధార్ కార్డు […]
AP CM Chandrababu : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్‌కు కేబినెట్ అభినందలు తెలిపింది. ప్రధాని మోదీ, ఇండియా సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఏపీ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి […]
Indo-Pak tensions : పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరుతో పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాడులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు.. భారత్, పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో […]
Chopper Crashes : ఉత్తరాఖండ్‌లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. అనంతపురం ఎంపీ సోదరి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భగీరథి నది సమీపంలో కూలిన హెలికాప్టర్.. ఉత్తర కాశీలో గురువారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ కూలింది. పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ఉన్నట్లు అధికారులు […]
Air India : ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రక్షణ సిబ్బందికి రిఫండ్ ఇవ్వనున్నది. విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖకు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డబ్బులు తిరిగి రిఫండ్ చేయనున్నది. ఈ నెల 31 వరకు టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణం రద్దు చేసుకున్న రక్షణ సిబ్బందికి డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూపు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన పరిణామాల […]
All-party meeting chaired by Rajnath Singh : పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో ఇండియా పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. దేశ భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి ఉగ్రస్థావరాలపై దాడిచేయగా, దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి కేంద్రప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలని ప్రధాని ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. భేటీకి ముందు ప్రధాని నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ఈ నేపథ్యంలో […]
Encounter : ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఇందులో మావోయిస్టు కీలక నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ, ఓడిశా సరిహద్దు ప్రాంతం అల్లూరి జిల్లా వై రామవరం, జీకేవీధి మండలాల్లో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్‌లో మావోలు ఎదురుపడ్డారు. పోలీసులు, మావోల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత […]