Home /Author anantharao b
బ్రేక్ ప్యాడ్లు రాపిడి కారణంగా పూరీ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్ యొక్క ఏసీ కోచ్ లో మంటలు రేగాయని రైల్వే అధికారి తెలిపారు. దీనితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని ఖరియార్ రోడ్ లో రైలు నిలిపివేసారు. రైలు గురువారం సాయంత్రం ఖరియార్ రోడ్ స్టేషన్‌కు చేరుకోగానే బి3 కోచ్‌లో పొగలు కనిపించాయని తెలిపారు
వారణాసి జ్ఞాన్వాపి మసీదు కేసు నుండి ఉపసంహరించుకున్న కొద్ది రోజుల తర్వాత, రాఖీ సింగ్ బుధవారం నాడు, మిగిలిన నలుగురు వ్యాజ్యదారుల నుండి వేధింపులను పేర్కొంటూ అనాయాస మరణానికి తన అభ్యర్థనను మన్నించవలసిందిగా రాష్ట్రపతిని కోరింది.
: కెనడా అడవిలో ఏర్పడ్డ కార్చిచ్చు దానావలంలా ఆ పొగ కాస్తా న్యూయార్కు గగనతలంలోకి రావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్రఆకాశం ఆరేంజి కలర్లోకి మారిపోయింది.
ఇటలీ పార్లమెంట్లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లో తన కుమారుడికి పార్లమెంట్ హాల్లోనే పాలు ఇచ్చింది. సభ్యులు కూర్చునే బెంచ్ వద్ద పిల్లోడిని ఎత్తుకుని చనుబాలు తాగించింది.
బంగ్లాదేశ్‌లో దశాబ్దం తర్వాత ఈ ఏడాది ఎండలు ఠారెత్తించాయి. దీంతో దేశంలో తరచూ కరెంటు కోతలకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దేశంలో ఇంధన కొరతతో విద్యుత్ కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు.. మరో పక్క కరెంటు కోతలతో బంగ్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు.
గురువారం గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగానికి ‘మోదీ, మోదీ’ నినాదాలతో అంతరాయం కలిగింది. దీనితో ఆయన తనదైన శైలిలో వారికి నచ్చచెప్పే యత్నం చేసారు.
టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు మమ్మరం చేశారు. ఏఈ, ఏఈఈ, డిఏవో పేపర్లు కొనుగోలు చేసిన వారి డేటాబేస్‌ని సిట్ అధికారులు తయారు చేశారు. మరో 48మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. వీరిలో ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన 38మంది అభ్యర్థులు 10మందికి పైగా దళారులు ఉన్నట్లు తెలిసింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై రేపు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈ నెల 5న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటర్లో సిబిఐ పలు అంశాలు ప్రస్తావించింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, (నీట్) పరీక్ష సందర్బంగా తన ఒఎంఆర్ షీటును పాడుచేసి ఇబ్బందిపెట్టినందుకు దిశా శర్మ అనే యువతి పరీక్ష ఇన్విజిలేటర్‌పై రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వివరాలివి.
బీహార్ రాజధాని పాట్నాలో ఓ మహిళ తన భర్తను అతని ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి గాయపరిచింది. తన అత్తమామలు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.