Home /Author anantharao b
జపాన్‌లోని ప్రధాన సుషీ రెస్టారెంట్ గ్రూప్ అయిన సుషిరో, తన అవుట్లెట్లలో ఒకదానిలో సోయా సాస్ బాటిల్‌ను రుచి చూసిన బాలుడిపై సుమారుగా 4 కోట్ల రూపాయలకు దావా వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) ప్రకారం, రెస్టారెంట్ చైన్‌ను నడుపుతున్న అకిండో సుషిరో మార్చి 22 న ఒసాకా జిల్లా కోర్టులో దావా వేయగా, ఈ నెలలో వివరాలు వెల్లడయ్యాయి
బీహార్‌లో రెండు ప్రైవేట్ సంస్థల ప్రమేయం ఉన్న రూ.250 కోట్ల అక్రమ మైనింగ్ స్కామ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటపెట్టిందని అధికారులు తెలిపారు. 27 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.1.5 కోట్ల నగదు, రూ.11 కోట్ల ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్‌లో అర్చకుడి చేతిలో దారుణ హత్యకి గురైన అప్సర అసలు ఇంటినుంచి ఎలా వెళ్ళింది.? ఎక్కడెక్కడ తిరిగారు.? ఏం చేశారు.? అర్చకుడు సాయి ఆమెని హత్య చేసేందుకు ఎంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడు.? ఏ ఆయుధంతో అప్సరని మట్టుబెట్టాడు.? ఇలాంటి విషయాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ తన భర్త భగవంత్ మాన్కు పంజాబ్ ముఖ్యమంత్రి కుర్చీని బహుమతిగా ఇచ్చారని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పుడు పంజాబ్‌కు నాయకత్వం వహించాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూను కోరారని తెలిపారు. అయితే ఆయన తన పార్టీకి ద్రోహం చేయకూడదని నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు.
న్యూఢిల్లీలో నిరసన తెలిపిన రెజ్లర్లపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) దాఖలు చేయాలని అభ్యర్థనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు యాక్షన్ టేక్ రిపోర్ట్ (ఎటిఆర్)ని కోర్టుకు సమర్పించారు.రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, విద్వేషపూరిత ప్రసంగానికి పాల్పడ్డారని పిటిషన్లో ఆరోపించారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి ప్రారంభమయే శ్రీ అమర్నాథ్ యాత్రలో యాత్రికులు కూల్ డ్రింక్స్, కరకరలాడే స్నాక్స్, డీప్ ఫ్రైడ్ మరియు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, జిలేబీ మరియు హల్వా వంటి స్వీట్లు, పూరీలు తీసుకోలేరు
: తన సహజీవన భాగస్వామిని చంపి, ఆపై ఆమె శరీర భాగాలను నరికి, ఉడకబెట్టినందుకు అరెస్టయిన మనోజ్ సానే తాను సరస్వతి వైద్యను చంపలేదని పోలీసులకు చెప్పాడు.జూన్ 3న సరస్వతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని మనోజ్ పోలీసులకు తెలిపాడు
నిత్యం పూజలు చేస్తూ భక్తిలో మునిగి తేలే అర్చకుడు ఓ మహిళని చంపేశాడు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి వివరాలివి. హైదరాబాద్ సరూర్ నగర్‌లోని బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న వెంకట సాయి సూర్య కృష్ణకి ఆలయంలో పరిచయం అయిన అప్సర అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వాంగ్మయి బుధవారం బెంగళూరులోని జయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ప్రతీక్ దోషితో వాంగ్మయి వివాహం జరిగింది.
బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం సందర్బంగా గుర్తుతెలియని మృతదేహాలను వెలికితీసినపుడు తాత్కాలికంగా అక్కడ సమీపంలో ఉన్న బహనాగ నోడల్ పాఠశాలలో వీటిని ఉంచారు. అయితే వేసవి సెలవుల అనంతరం విద్యార్దులు, సిబ్బంది తిరిగి స్కూళ్లను తెరిచాక అక్కడ ఉండటానికి నిరాకరించడంతో దానిని కూల్చేసారు.