Telangana Congress: అటు ఎలక్షన్ .. ఇటు యాత్ర.. టీ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట.. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు రాకపోవచ్చని భావించిన నేతలకు ఎన్నికల సంఘం ఒక్కసారి షాక్ ఇచ్చింది.. షెడ్యూల్ విడుదల చేసి ఒక దెబ్బకి రెండు పిట్టలను కొట్టిందని చర్చించుకుంటున్నారు.. తెలంగాణలో ఈనెల 24 తేదీన రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఎంటరవుతుంది. కనీవిని ఎరుగని విధంగా.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా నిర్వహించాలని పీసీసీ నాయకులు ప్లాన్ చేశారు. అగ్రనేత పాదయాత్రను అందరూ కలిసికట్టుగా పని చేసి విజయవంతం చేయాలని భావించారు.
అయితే ఇక్కడే కాంగ్రెస్ నేతల వ్యూహానికి దెబ్బపడింది.. రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుండటం నేతలకు టెన్షన్ పెట్టిస్తుందట.. ఒకేసారి ఈ రెండు సుదీర్ఘంగా జరిగే కార్యక్రమాలే కాబట్టి నేతలకు కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలను ఇంచార్జ్ లుగా వేసింది. ఒక్కో మండలానికి ఒక సీనియర్ నేత ఇంచార్జ్‌గా.. మరో ఇద్దర్ని సహా ఇంచార్జ్ లుగా నియమించారు. మరోవైపు బూత్ ఇంచార్జ్ లుగా మరో 200 మంది రాష్ట్ర స్థాయి నేతలకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా మునుగోడు పై ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి గడపగడపకు తిరుగుతున్నారు.అయితే ఎన్నిక జరిగే సమయంలో ఈ ముఖ్య నేతలు ఎవరు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. రాహుల్ గాంధీ పాదయాత్ర అక్టోబర్ 24 న ప్రారంభమైన నవంబర్ 9 వరకు జరగనుంది.. ఉప ఎన్నిక నవంబర్ 3 న జరిగి 5 ఫలితాలు వెలువడనున్నాయి.. దీంతో అటు ప్రచారంలో పాల్గొనే నేతలే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ని కూడా చూడల్సి ఉంటుంది.. ఉప ఎన్నిక కు ఇంచార్జ్ లుగా ఉన్న ఆ ముఖ్య నేతలే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర లో పాల్గొనాల్సి ఉంటుంది.. మరోవైపు ముందు నుంచీ ప్రచారం చేసి అక్కడ క్యాడర్ లో జోష్ తెచ్చినా.. ఎన్నికల రోజు పోల్ మేనేజ్మెంట్ చేయకపోతే.. చేసిన ప్రచారం కూడా వృథా అవుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు.. కాంగ్రెస్ లోని కొంతమంది నేతలు మాత్రం రాహుల్ గాంధీ పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుండడంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ప్రచారం చేస్తున్న క్యాడర్‌కి – రాహుల్ గాంధీ జోడోయాత్ర ద్వారా వచ్చే స్పందన, ప్రజల్లో చర్చే మునుగోడు లో తమని గెలిపిస్తుందని వారు ఆశాభావంగా ఉన్నారు. రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో వచ్చే హైప్ మునుగోడులో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆయన తెలంగాణ దాటే లోపు మునుగోడు గిఫ్ట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెబుతున్నారు. అయితే.. ప్రచారంలో ఉన్న ఇంచార్జ్‌లు ప్రచారం చేస్తూనే రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనే విధంగా పీసీపీ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. రాహుల్ యాత్ర మునుగోడు ఉప ఎన్నికపై ఎటువంటి ప్రభావం చూపదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో గెలిచిన టీఆరెస్ మునుగోడుకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. మునుగోడు ప్రజలారా మీ ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తామన్నారు రేవంత్‌రెడ్డి.