Last Updated:

Kapu Sangam : ఘనంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం వనమహోత్సవం

శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్వర్యంలో ఆదివారం వనమహోత్సవం ఘనంగా జరిగింది.

Kapu Sangam : ఘనంగా శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం  వనమహోత్సవం

Kapu Sangam: శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్ లో వనమహోత్సవం  ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 15 వేలమందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అరవ రామకృష్ణ మాట్లాడుతూ 56వ వనమహోత్సవ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండి 15వేల మందికి పైగా హాజరయ్యారని పేర్కొన్నారు.విద్యార్థులకు 7లక్షల పైగా స్కాలర్ షిప్ లతో పాటు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నుండి కాపు సంఘానికి రావలసిన అన్ని అంశాలను సాధించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రైమ్ 9 న్యూస్ చైర్మన్ బండి శ్రీనివాస రఘువీర్, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగవీటి రాధా, పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: