Published On:

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టుల లొంగుబాటు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టుల లొంగుబాటు

 

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 17 మంది మావోయిస్టులు లొంగుపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు ఏసీఎం సభ్యులు, నలుగురు పార్టీ క్యాండేట్‌లు, మిగతా వారు పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయినవారికి 25 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆపరేషన్ కర్రిగుట్టలో మృతిచెందడంతో చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు.

 

 

ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఏలూరు నాగారం మండంలం రాయిబంధం గొత్తి కోయగూడెంలో మావోయిస్టు దంపతులు తలదాచుకున్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు..మహిళా మావోయిస్టు మడకం చిట్టి అలియాస్ కీడో గూడెంకు వచ్చారు. బంధువుల ఇంట్లో దంపతులు వైద్యం తీసుకుంటున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసుల భయంతో గూడెం వాసి తప్పించుకుపోయాడు.

 

 

ఇవి కూడా చదవండి: