Home / bomb threat
Tirupati Hotels Receive Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. కాగా గత రెండు రోజులుగా వరుసగా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామనుజ కూడలిలోని ఓ హోటల్‌కు కూడా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు […]
న్యూఢిల్లీలోని మినిస్ర్టీ ఆఫ్ హోం ఎఫైర్స్ ఆఫీస్‌కు బుధవారం బాంబు బెదిరింపు ఈ మెయిల్‌వచ్చింది. దాంతో బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫైర్ టెండర్స్‌ను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయని.. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదని పోలీసులు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని పలు స్కూళ్లకు ఈ- మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా స్కూళ్లకు సెలవు ప్రకటించి.. బాంబు కోసం గాలింపు చేపడితే ... అది కేవలం బెదరింపు ఈ మెయిల్ అని తేలింది
ఢిల్లీ స్కూళ్లకు ఈ మెయిల్స్ బాంబు బెదిరింపు ఎపిసోడ్ మరిచిపోక ముందే అమ్మదాబాద్‌లోని పలు స్కూళ్లకు ఇలాంటి ఈ మెయిల్స్ బాంబు బెదరింపులువచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల స్కూళ్లను బాంబులతో పేల్చివేస్తామని గత గురువారం పలు స్కూళ్లకు ఈ మెయిల్స్ రావడంతో స్కూళ్ల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.
డిల్లీలోని 80కి పైగా స్కూళ్లు, మరియు నోయిడాలోని కనీసం రెండు స్కూళ్లకు బుధవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, దీంతో ఈ పాఠశాలలనుంచి విద్యార్దులను తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
బెంగళూరులోని సుమారు 60 స్కూళ్లకు శుక్రవారం గుర్తు తెలియని ఈ మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల అధికారులలో భయాందోళనలు నెలకొన్నాయి.బసవేశ్వర్ నగర్‌లోని నేపెల్ మరియు విద్యాశిల్ప సహా ఏడు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మొదటి బెదిరింపులు వచ్చాయి.
సోమవారం నాడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే నుండి బెంగళూరుకు వెళ్లే ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో విమానాన్ని నిలిపివేసారు. కాల్ వచ్చినప్పుడు విమానం ఉదయం 10.30 గంటలకు షెడ్యూల్ ప్రకారం బయలుదేరడానికి రన్‌వేపై సిద్దంగా ఉంది.
TCS Office: మాదాపూర్ లోని టీసీఎస్ సాఫ్ట్ వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీస్ లో బాంబు పెట్టినట్లు కాల్ వచ్చింది. వెంటనే ఆ కంపెనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
మహారాష్ట్ర పుణెలోని గూగుల్ కార్యాలయానికి బెదిరింపు ఫోన్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంగణాన్ని విస్తృతంగా తనిఖీ చేశారు.