Bandi Sanjay: కవిత డ్రామా వెనక కాంగ్రెస్ పార్టీ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
BJP MP Bandi Sanjay Sensational Comments on BRS leader Kavitha: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత డ్రామా వెనక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో చార్ పత్తా ఆట నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల గురించి చర్చ జరగకుండా చిట్ చాట్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. కల్వకుంట్ల సినిమా ప్రొడక్షన్‌కు కాంగ్రెస్ డైరెక్షన్ చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజీపీకి టచ్‌లో వచ్చారని, బీజేపీలో విలీనం చేస్తున్నామని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని బండి సంజయ్ ఆరోపించారు. రెండు పార్టీలతో ఉపయోగం లేదని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఎప్పటికీ కలిసిపోవన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.