WhatsApp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక భాషతో పనిలేదు.. ఒక్కసాకి ట్రై చేయండి..!

WhatsApp New Feature: వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్, ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి అనేక అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ నేపథ్యంలో Meta-యాజమాన్యమైన కంపెనీ ఇప్పుడు కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది చాట్ మేసేజెస్, ఛానెల్ అప్‌డేట్‌లను మీ ప్రాధాన్య భాషలోకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేట్ చేస్తుంది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా, మీరు ఏదైనా తెలియని భాష వినియోగదారులతో సులభంగా చాట్ చేయగలుగుతారు. వాట్సాప్ రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo ప్రకారం.. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉంది. దీనిని బీటా టెస్టర్లు మాత్రమే ప్రయత్నించగలరు. దాని గురించి అభిప్రాయాన్ని తెలియజేయగలరు.

WABetaInfo ప్రకారం.. వాట్సాప్ వివిధ భాషలలో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి ప్రత్యేకంగా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌లో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.26.9లో బీటా టెస్టింగ్‌లో ఉంది. మంచి విషయం ఏమిటంటే..ఈ ట్రాన్స్‌లేట్ పూర్తిగా వినియోగదారు ఫోన్‌లో జరుగుతుంది, దీని కారణంగా మీ ప్రైవసీ,  భద్రతను నిర్వహిస్తుంది.

ఈ ఫీచర్ వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తుంది. ఈ ఫీచర్ సాధారణ ట్రాన్స్‌లేషన్  కంటే చాలా సురక్షితమైనది, ఉపయోగకరంగా ఉంటుంది. ఇతర ట్రాన్స్‌లేట్ టూల్స్ క్లౌడ్ సర్వర్‌లకు డేటాను పంపుతాయి కాబట్టి, ఈ ఫీచర్ ముందుగా డౌన్‌లోడ్ చేసిన లాంగ్వేజీ ప్యాక్‌లను ఉపయోగిస్తుంది, కాబట్టి థర్డ్ పార్టీ సర్వీసెస్ లేదా WhatsApp సర్వర్‌లతో డేటా షేర్ చేయదు.

వినియోగదారులు ట్రాన్స్‌లేషన్ కోసం అవసరమైన లాంగ్వేజ్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్యాక్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా చాట్ మేసేజెస్‌ను ట్రాన్స్‌లేట్ చేయచ్చు. ఈ ఆఫ్‌లైన్ అనువాదం మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది. మీకు కావలసినప్పుడు ట్రాన్స్‌లేట్ చేయచ్చు.

వినియోగదారులు ఏ సందేశాలను అనువదించాలనుకుంటున్నారో ఎంచుకునే ఎంపికను కలిగి ఉంటారు లేదా అన్ని కొత్త సందేశాలు, ఛానెల్ అప్‌గ్రేడ్‌ల కోసం వారు ఆటోమాటిక్‌గా ట్రాన్స్‌లేట్ ఆన్ చేయవచ్చు. ఈ ఫీచర్ అనధికారికమైనా లేదా అధికారికమైనా అన్ని రకాల సంభాషణలకు అనుకూలంగా ఉంటుంది.

మీ డేటా సురక్షితంగా ఉండేలా చూడడమే WhatsApp ప్రధాన లక్ష్యం. ఈ ఫీచర్‌లో ట్రాన్స్‌లేట్ మీ ఫోన్‌లో మాత్రమే జరుగుతుంది. మీ డేటా ఏదీ థర్డ్ పార్టీ లేదా WhatsApp సర్వర్‌లలో షేర్ కాదు. అయినప్పటికీ, కొన్నిసార్లు ట్రాన్స్‌లేషన్ పూర్తిగా ఖచ్చితమైనవి కాకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆఫ్‌లైన్‌లో పని చేస్తుంది. రియల్ టైమ్ అప్‌గ్రేడ్లను పొందదు. అయినప్పటికీ, ఈ ఫీచర్ వినియోగదారులకు వివిధ భాషలలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది.  దీనికి అధికారిక లాంచ్ తేదీ లేదు. అయితే, ఈ ఫీచర్ భవిష్యత్తులో WhatsApp కొత్త అప్‌డేట్‌లతో అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుతం, బీటా టెస్టర్లు దీనిని ప్రయత్నించవచ్చు. దాని గురించి అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడంతో వాట్సాప్ వినియోగదారులు వివిధ భాషలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కమ్యూనికేట్ చేయగలరు, ఇందులో దేశంలోని వివిధ మాండలికాలు, విదేశీ భాషలు ఉంటాయి.