Home / tollywood
బుల్లితెర రాములమ్మ నెట్టింట తన అందాలతో కుర్రకారును కళ్లుతిప్పుకోకుండా చేస్తుంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ డ్రెస్ తో పిచ్చెక్కిస్తుంది. సైమా అవార్డ్స్ సందర్భంగా యాంకర్ శ్రీముఖి బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫొటోలను తను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ప్రముఖ టీవీ యాంకర్ గా పలు వైవిధ్యభరితమైన ప్రోగ్రాంలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును మరియు అభిమానులను ఆమె ఏర్పరచుకుంది. కాగా ఇటీవల బిగ్ బాస్ షోతో అభిమానుల్లో మరింత క్రేజ్ తెచ్చుకుంది.
ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాలలో కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ ఒకటి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందాని ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీపికబురు చెప్పారు మూవీ మేకర్స్.
అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ స్టూడియోస్ ను ప్రారంభించారు. అల్లు వారి కుటుంబం మరియు మెగాస్టార్ కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మెగాస్టార్.
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీకోర్టు ఆదేశించింది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు సినీ ప్రేక్షకులను పరిచయమైన కావ్య, హీరోయిన్ గా అడుగు పెట్టబోతుంది. తిరువీర్ హీరోగా నటించిన సినిమా 'మసూద'. ఈ సినిమా హార్రర్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
68వ జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. 2020 ఏడాదికి గాను పలు చిత్రాల్లో ఉత్తమ చిత్రాలను ఇటీవల ఎంపిక చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. నిన్న అవార్డులను అందజేశారు.
నటి రేణు దేశాయ్ రెండు దశాబ్దాల తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పెద్ద తెరపైకి వస్తున్నారు. రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేయడానికి మేకర్స్ గురువారం ఒక చిన్న టీజర్‌తో ముందుకు వచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం వచ్చే వారం విడుదలకానుంది. ఇది కాకుండా చిరు వాల్తేర్ వీరయ్య మరియు భోళా శంకర్ల సినిమాలు కూడ షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి.
వైకాపా తరపున 2024లో విజయవాడ పార్లమెంటు స్థానం నుండి నటుడు అక్కినేని నాగార్జున పోటీ చేస్తారంటూ వస్తున్న ప్రచారాలకు తెరపడింది. ఏ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని పేర్కొన్నారు
హీరో కార్తీ సర్దార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో దీపావళి కానుకగా మన ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.