Home / suryapet
Farmer Couple Attempt Suicide in Suryapet: క్వింటాలుకు ఏడున్నర కిలోల తరుగు కోతకు రైతు అంగీకరించలేదన్న కారణంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నాణ్యతగా లేదంటూ రైస్ మిల్లర్ నిర్వాహకులు తిప్పి పంపారు. దీంతో నిరసిస్తూ రైతు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చౌళ్లతండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు కీమా 425 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో విక్రయించాడు. కాంటా అయిన తర్వాత ధాన్యాన్ని మిల్లు యాజమాని పరిశీలించి […]
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని కందులవారిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల్లో తగాదాలు రావడంతో కుమారుడు తల్లి అంతక్రియలను ఆపేశారు. పెద్దఖర్మ ఖర్చుపై పంచాయతీ తేలితేనే తలకోరివి పెడతానని కొడుకు పట్టుబట్టడంతో మృతదేహం ఫ్రీజర్‌లోనే ఉండిపోయింది.
బీసీల అభ్యున్నతికి, తెలంగాణ అభివృద్ధికి పాటుపడేది కేవలం బీజేపీ ఒక్కటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సూర్యాపేటలో జరిగిన జనగర్జన సభలో మాట్లాడిన అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతని ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించామని ప్రకటించారు.
తెలంగాణలో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపికైంది. జిల్లా పోలీసులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.
ఇటీవల కాలంలో పలు కుటుంబాల్లో రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. రోజూ ఏదో ఒక మూల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుమంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.