Home / Maoists
4 Maoist Killed in Maharashtra Encounter: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోలు చనిపోయారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు సహా దాదాపు 30 మంది వరకు మృతి చెందారు. తాజాగా దండకారణ్యంలో కాల్పుల మోత మోగింది. అలాగే ఇవాళ ఉదయం ఛత్తీస్ గఢ్ లోని […]
1 Maoist Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని వరుసగా ఎదురుకాల్పులు కొనసాగుతోన్నాయి. సుక్మా జిల్లాలోని కిష్టారం అటవీ ప్రాంతంలో మావోలు ఉన్నట్లు భద్రతా బలగాలకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో కిష్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా బలగాల మీదకు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులకు దిగాయి. ఇరువైపులా ఎదురు కాల్పులు కొనసాగుతోన్నాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. […]
5 Maoists Killed In Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని పీడియా అడవుల్లో నక్సల్స్, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో నిన్న జరిగిన కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా వరుసగా ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి చెందుతున్నారు. మావోయిస్టుల […]
Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు పలు హోదాల్లో పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు. అయితే లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి రూ. 25 […]
Break for Operation Kagar: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో ఇరవై రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో భద్రతా బలగాలు కగార్ ఆపరేషన్ నిలిపివేసి వెను తిరిగి వెళ్లిపోవడంతో బాంబుల మోత ఆగిపోయింది. దీంతో వెంకటాపురం, వాజేడు మండలాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇక ఛత్తీస్‌గఢ్ వైపు ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, బస్తర్ ఫైటర్స్‌తో కూంబింగ్ జరుగుతోంది. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ తో భారత్ ఢీకొంది. ఇందులో […]
Twenty Maoists Massive Encounter at Karre Gutta: చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Karregutta: తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో జవాన్లకు మావోయిస్టులకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి (operation kagar). బీజాపూర్ సరిహద్దు కర్రెగుట్టల్లో 14వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐఈడీ పేలుడులో ముగ్గురు ఎస్టీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి మరొ ఇద్దరు మావోయిస్టులు తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో జవాన్లు చికిత్స పొందుతున్నారు. అటు జవాన్ల డ్రోన్‌కి మావోయిస్టులు చిక్కారు. ఉసూరు- సీతాపూర్ మధ్య మావోయిస్టుల జాడను గుర్తించారు. కూంబింగ్ పార్టీని హతమార్చేందుకు ఐఈడీ […]
Three female Maoists Bodies Identifed in Karregutta Forests: ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల్లో ఎనిమిదో రోజు భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. అయితే తనిఖీల్లో ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఎన్కౌంటర్లో మావోయిస్టులు మృతి చెందారు. పీఎల్జీఏ నంబర్ 1 బెటాలియన్‌కు చెందిన శాంతి, హంగి, సింట్గా గుర్తించారు. కాగా, గుట్టలను 20వేలకుపైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. తనిఖీల్లో అడుగడుగునా బీరు సీసాల్లో మందుపాతరలు అమర్చినట్లు గుర్తించారు. కాగా, మరోసారి శాంతి […]
1,000 naxals surround by 20,000 troops in Chhattisgarh : వెయ్యిమంది మావోయిస్టులను 20వేల భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా కదులుతున్నాయి. ఈ ఆపరేషన్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరుగుతోంది. ఇందులో చత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర కు చెందిన బలగాలు పాలుపంచుకుంటున్నాయి. మావోయిస్టులను నిర్మూలించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి31, 2026ను గడువు విధించిన నేపథ్యంలో బలగాలు కదులుతున్నాయి. అగ్రనాయకులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఉచ్చుబిగించాయి. ఇందులో మోస్ట్ […]
Amit Shah : 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గినట్లు వెల్లడించారు. నక్సల్ రహిత భారత్‌ను నిర్మించే దిశగా మరో మైలు రాయిని చేరుకున్నామని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో కొన్ని రోజులుగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య […]