Home / Delhi government
దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై తక్షణమే నిషేధం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ నోటీసు ప్రకారం, ఈ నిర్ణయం ఓలా, ఉబర్ మరియు రాపిడో వంటి బైక్ అగ్రిగేటర్లను ప్రభావితం చేస్తుంది.
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీంతో సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనింది. రేపటినుండి ప్రైమరీ సూళ్లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తన ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మొహల్లా క్లినిక్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ వారికి గైనకాలజీ పరీక్షలు మరియు మందులు ఉచితంగా లభిస్తాయి.
ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.
దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది.
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రెండు రోజుల పాటు టపాకాయలు పేల్చి ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకొంటుంటారు. అయితే టపాకాయల పేల్చేందులో మాత్రం ఢిల్లీ వాసులకు ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బాణసంచాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది
ఢిల్లీ ప్రభుత్వం 1,000 బస్సులను కొనుగోలు చేయడంలో జరిగిన అవినీతిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తుకు రంగం సిద్దమయింది. జూన్లో అందిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్కుమార్ సీబీఐ దర్యాప్తుకు విజ్ఞప్తి చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 వరకు అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు.అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం మరియు వినియోగం పూర్తిగా నిషేధించబడింది.
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.