Home / crime news
Odisha Minister: ఒడిశాలో కాల్పులు కలకలం రేపాయి. ఏకంగా మంత్రిపైనా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆరోగ్యశాఖ మంత్రిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బ్రెజరాజ నగర్లోని గాంధీ చౌక్ వద్ద మంత్రి నబకిశోర్దాస్పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు.
Rtc Twitter Hacked: వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా రోజు చోటు చేసుకుంటున్నాయి. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఆఫీస్ […]
Yadadri: యాదాద్రి జిల్లాలో ఓ కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. సహజీవనానికి అడ్డుగా ఉన్నారని.. పిల్లల్ని వదిలేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కన్నతల్లి ముగ్గురు పిల్లలను వదిలేయడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అండగా ఉంటాడనుకున్న తండ్రి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురి పిల్లల భారం చూడలేక.. తల్లి ఆ ముగ్గురిని వేరే ఊరిలో వదిలి వెళ్లిపోయింది. తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని […]
Brutal Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. హైదరాబాద్లోని పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. @TelanganaDGP @hydcitypolice @HiHyderabad @swachhhyd What is wrong with law and order in Hyderabad ? Murder at New Road Ziaguda! pic.twitter.com/7z0n4McJYu — Dr Mohammed Moinuddin Hasan Altaf (Team Rahul INC) (@moinaltaf1973) […]
Boat Accident: వాయువ్య డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. లులోంగా నదిలో 200 ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఓవర్ లోడు కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ పడవ ప్రమాదంలో దాదాపు 145 మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు తెలిపారు. మిగిలిన 55 ప్రయాణికులు ప్రాణాలతో సురక్షితంగా బయట పడినట్లు వెల్లడించారు. ఈ మోటరు బోటు లులోంగా నదిలో రాత్రిపూట వస్తువులు, జంతువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా […]
Fire accident in Hyderabad: సికింద్రాబాద్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నగరంలో అలజడి రేపింది. ఉదయం అంటుకున్న సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆరంతస్తుల భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో.. సమీప ప్రాంతాల్లో భయం నెలకొంది. ఈ భవనంలో వ్యాపార సముదాయాలు.. పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఫైరింజన్లు వచ్చినా.. మంటలు అదుపుకాలేదంటే పరిస్థి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంటలను అదుపుచేసే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది.. అస్వస్థతకు […]
Bhuvanagiri: భువనగిరి జిల్లా కోర్డు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. 2017లో అంబోజు నరేశ్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. 2017 మే నెలలో నరేష్ అనే యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని.. న్యాయమూర్తి […]
ఉక్రెయిన్ కీవ్ ప్రాంతంలోని కిండర్ గార్టెన్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి, ఇద్దరు పిల్లలు మరియు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రితో సహా 16 మంది మరణించారు.
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని షార్ (శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్) వద్ద వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్నాయి. వరుస ఆత్మహత్య నేపథ్యంలో షార్ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.
Medak: మెదక్ లో ఓ వ్యక్తి బీమా డబ్బుల కోసం ఆడిన డ్రామాను చూసి పోలీసులు కంగుతిన్నారు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి గోవాలో ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తి సజీవదహనం కేసు కీలక మలుపు తిరిగింది. బీమా డబ్బుల కోసమే డ్రైవర్ను వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం […]